Home /News /politics /

TRS LP AND TRS PARLIAMENTARY PARTY MEETING TOMORROW IN VIEW OF GHMC ELECTIONS BA

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేసీఆర్ భారీ ప్లాన్, రేపు కీలక భేటీ

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్రసమితి పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది.

    తెలంగాణ రాష్ట్రసమితి పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లను ఈ సమావేశానికి విధిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీ లను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన సమయంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్
    జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోవడంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికలకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ను బీజేపీ బాగా ఉపయోగించుకుంది. ఈసారి అలాంటి చాన్స్ ఇవ్వకూడదని భావించిన కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత వేగంగా నిర్వహించేందుకు వ్యూహం పన్నినట్టు భావిస్తున్నారు.

    రేపు జరగబోయే టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధాన ఎజెండా కానున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు కొన్ని డివిజన్ల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్‌ను గెలిపు బాధ్యతను వారి భుజాలపై పెట్టనున్నారు.

    తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేతుల్లో తోలుబొమ్మలా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోన్న పద్ధతిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పోలింగ్ తేదీలను ఇవ్వడం ఈ రాష్ట్రంలో ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ అని అన్నారు. ఇది బయటి వారి ప్రమేయం లేకుండా పనిచేయాలన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ చెప్పినట్టు ఆడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల సంఘం ప్రవర్తన ఉందని ఆయన ధ్వజమెత్తారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CM KCR, Hyderabad - GHMC Elections 2020, KTR, Telangana, Trs

    తదుపరి వార్తలు