Home /News /politics /

TRS LEADERSHIP SECOND THOUGHT REGARDING DISTRICT PRESIDENT POST AFTER SEVERAL COMPLICATIONS AK

Telangana: టీఆర్ఎస్‌లో ఆ పదవులు లేనట్టేనా ?.. ఆ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: గ్రామ కమిటీలు మొదలుకుని రాష్ట్ర కార్యవర్గం వరకు అన్ని దశల్లో ప్రక్షాళన చేస్తామని.. కొత్త కమిటీలు వేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి.. ఆ తరువాత వరి అంశంపై ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించిన అధినేత కేసీఆర్.. పార్టీ నిర్మాణంపై కొద్దిరోజుల కిందట దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించి ఆయన రోడ్ మ్యాప్ కూడా ప్రకటించారు. గ్రామ కమిటీలు మొదలుకుని రాష్ట్ర కార్యవర్గం వరకు అన్ని దశల్లో ప్రక్షాళన చేస్తామని.. కొత్త కమిటీలు వేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి.. ఆ తరువాత వరి అంశంపై ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకత్వం ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపించడం లేదనే చర్చ కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్.. ముందుగా అనుకున్నట్టు జిల్లా అధ్యక్షులను నియమించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

    అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటు తరువాత చాలా జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలు కంటే ఎక్కువగా లేవు. ఒకవేళ ఆ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో ఒకరిని జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే.. మిగతా వారి నుంచి అసంతృప్తి రావొచ్చని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందట. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కాకుండా జిల్లాలోని వేరే నియోజకవర్గాల్లో కూడా పెత్తనం చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరిగిందని సమాచారం.

    అంతేకాదు పార్టీ కొత్తగా జిల్లా అధ్యక్షులను నియమిస్తోందని తెలిసిన తరువాత.. ఈ పదవి కోసం ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు గట్టిగానే చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది కూడా టీఆర్ఎస్ నాయకత్వానికి ఒకరకంగా ఇబ్బందిగా మారిందని.. ఈ ప్రతిపాదనను పక్కనపెట్టేందుకు కారణమైందనే చర్చ సాగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు కాని నేతలను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే.. వారి మాటను ఎమ్మెల్యేలు ఎంతవరకు వింటారనే దానిపై కూడా స్పష్టత లేదు.

    Telangana: వరికి బదులు ఈ పంటల వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన

    Etela Rajendar: ఈటల రాజేందర్ మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే బీజేపీలో లెక్కలు మారతాయా ?

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    అంతేకాదు జిల్లా అధ్యక్షులుగా నియమించబడిన వాళ్లు.. ఏదో ఒక నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించవచ్చని.. అది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారొచ్చనే చర్చ కూడా పార్టీలో జరిగినట్టు సమాచారం. అలా జరిగితే.. జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం తీసుకొచ్చిన ఈ కొత్త పదవుల కారణంగా కొత్త సమస్యలు వచ్చి.. అది మొదటికే మోసం వచ్చేలా కావొచ్చని పలువురు అంచనా వేసినట్టు తెలుస్తోంది.

    అందుకే పార్టీ నాయకత్వం ఈ కొత్త పదవుల అంశాన్ని పక్కనపెట్టిందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్‌లో నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలోని కీలక పదవులు దక్కించుకోవాలని భావిస్తున్న నేతలకు.. టీఆర్ఎస్ నాయకత్వం తాజా ప్రతిపాదన నిరాశ కలిగిస్తుందనే చెప్పాలి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు