మెదక్‌లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక... టీఆర్ఎస్‌లోనే అసంతృప్తి

మెదక్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పట్ల టీఆర్ఎస్‌లోనే అసంతృప్తి వ్యక్తమైంది.

news18-telugu
Updated: January 27, 2020, 12:59 PM IST
మెదక్‌లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక... టీఆర్ఎస్‌లోనే అసంతృప్తి
ఆందోళనలో సొమ్మసిల్లి పడిపోయిన టీఆర్ఎస్ నేత మల్లికార్జున్ గౌడ్
  • Share this:
మెదక్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక పట్టణంలో ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్‌ను నియమించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నిర్ణయంపై తాజా మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్ గౌడ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్యమకారులను పక్కనబెట్టి పెట్టుబడిదారులకు అవకాశం కల్పించారని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర రాస్తారోకో చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేసిన తమను కాదని ఇటీవల పార్టీలో చేరిన చంద్రపాల్‌కు అవకాశం కల్పించారని మల్లికార్జున్ గౌడ్, మరో కౌన్సినల్ ఆకిరెడ్డి క్రిష్ణారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

మల్లికార్జున్ గౌడ్ గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా పని చేశారు. క్రిష్ణారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పని చేశారు. ఈ సారి కూడా మల్లికర్జున్ గౌడ్‌కు వైస్ చైర్మెన్ పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే గతంలో పార్టీ వారిని సముచితంగా గౌరవించిందని... ప్రతీ సారి వారికే అవకాశం కల్పించలేమని స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్‌ల ఎన్నికల కవరేజీకి మీడీయాను అనుమతి నిరాకరించడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 18 మంది టీఆర్ఎస్, 3 బీజేపీ, ఇండిపెండెంట్, ఎంఐఎం సభ్యుల మద్దతుతో చంద్రపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Published by: Kishore Akkaladevi
First published: January 27, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading