తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ప్రజలు ఘననివాళి అర్పించారు. తెలంగాణ ప్రజానీకం గౌరవంగా పిలుచుకునే సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణలోని పల్లెలు, పట్నాలు, విద్యాలయాల్లో ప్రొఫెసర్‌కు నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ 84వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి.తెలంగాణ వచ్చాక ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని జయశంకర్ ఆశించారో నేడు సీఎం కేసీఆర్ అవే పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
నాలుగు కోట్ల మంది ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత కొత్తపల్లి జయశంకర్‌కు మా నమస్సుమాంజలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.