హోమ్ /వార్తలు /politics /

TRSలో ఆ పదవులు ఎవరికి ? KCR లెక్క ఏంటి ?.. భారీగా ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలు

TRSలో ఆ పదవులు ఎవరికి ? KCR లెక్క ఏంటి ?.. భారీగా ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలు

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Telangana: త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో.. ఆ తరువాత దీనిపై గులాబీ బాస్ దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర కమిటీని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని గులాబీ బాస్ భావించారు. ఇందుకోసం రెండు నెలల క్రితమే నిర్ణయం కూడా తీసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు పార్టీని నిర్మిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలు, అక్కడ పార్టీ ఓటమి తరువాత తలెత్తిన పరిణామాలు, ఆ తరువాత ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో.. ఆ తరువాత దీనిపై గులాబీ బాస్ దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే కీలకమైన నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకుని నిరాశ చెందిన అనేక మంది నేతలు... రాష్ట్ర కమిటీలో అయినా తమకు చోటు దక్కుతుందా ? అని ఎదురుచూస్తున్నారని సమాచారం. కొందరైతే పార్టీలో కీలకమైన ఈ కమిటీలో చోటు కోసం అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే గతంలో రాష్ట్ర కార్యవర్గంలో ఉండి.. యాక్టివ్‌గా లేని నాయకులకు మరోదఫా అవకాశం ఇవ్వకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్లు ఎవరు.. పెద్దల దృష్టిలో మైనస్‌ మార్కులు ఎవరికి పడ్డాయి అన్నది పార్టీ వర్గాలు అంచనా వేయలేని పరిస్థితి.

కమిటీ కూర్పులో పార్టీ పెద్దల ఆలోచన ఏంటన్నది వారికి అంతుచిక్కని ప్రశ్న. కమిటీలో తమను ఎంపిక చేయకపోతారా అని ఎవరికి వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీకి రాష్ట్ర కమిటీ ఎంతో కీలకమైనది కావడంతో.. గతంలో మాదిరి కాకుండా పార్టీలో క్రియాశీలకంగా పని చేసే వారిని మాత్రమే ఈ కమిటీలోకి తీసుకోవాలనే యోచనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

అలాంటి వారిని ఎంపిక చేసే బాధ్యతను కొందరు ముఖ్యనేతలకు టీఆర్ఎస్ నాయకత్వం అప్పగించిందనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించే వాళ్లనే ఈ కమిటీలోకి తీసుకోవాలని.. కమిటీలో నేతలకు చోటు కల్పించడం ద్వారా భవిష్యత్తులో వారికి ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలను కూడా ఇవ్వొచ్చనే ఉద్దేశ్యంతో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Telangana: కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఈటల బీజేపీకి అలాంటి సలహా ఇచ్చారా ?

Revanth Reddy: అలా జరగకుండా చూడండి.. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్..

Egg: కోడి గుడ్లతో ఇలా చేయండి.. ఇక మీ అందానికి తిరుగుండదు..

అందుకే ఈ కమిటీలో చోటు విషయంలో నేతల సిఫార్సులను పట్టించుకోకుండా కేవలం.. నేతల సమర్థతకు మాత్రమే పెద్దపీట వేయాలనే ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంటుందని.. అలాంటి సందర్భాల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించాలని టీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు