TRS LEADERS MEET THE STATE ELECTION COMMISSIONER OVER SYMBOLS ALLOTMENT NS
GHMC Elections: కారు ను పోలిన గుర్తు ఇతరులకు ఇవ్వొద్దు.. ఎస్ఈసీకి టీఆర్ఎస్ నేతల వినతి
తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 188 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
రోటీ మేకర్ గుర్తు లేకపోతే తాము దుబ్బాకలో గెలిచేవారమని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ట్రక్కు, ఆటోల గుర్తు కారణంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి చెందారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పలువురు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు.
దుబ్బాకలో ఓటమి అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పీఠాన్ని చేజెక్కించుకుని రాష్ట్రంలో తమకు తిరుగులేదని మరో సారి చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే దుబ్బాక ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించిన రోటీ మేకర్ గుర్తు తమను దెబ్బ కొట్టిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ అభ్యర్థికి దాదాపు 3500కు పైగా ఓట్లు వచ్చాయి. రోటీ మేకర్ కూడా కారును పోలి ఉండడంతో కొందరు ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురయ్యారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో కారుకు బదులుగా ఆ గుర్తుకు ఓటు వేశారని ఫలితంగా తమ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓటమి చెందారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
ఆ రోటీ మేకర్ గుర్తు లేకపోతే తాము దుబ్బాకలో గెలిచేవారమని వారి అంచనా. గతంలోనూ ట్రక్కు, ఆటోల గుర్తు కారణంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి చెందారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పలువురు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. తమ పార్టీ గుర్తు అయిన కారును పోలిన గుర్తుల్ని ఎవరికీ కేటాయించవద్దని కోరారు.
ఈ మేరకు మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ నేతలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిశారు. కారును పోలిన గుర్తులను వేరే అభ్యర్థులకు కేటాయించడం వల్ల తమ పార్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఎన్నికల కమిషనర్ కు టీఆర్ఎస్ నేతలు వివరించారు. అయితే టీఆర్ఎస్ వినతిపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.