TRS LEADERS LOOKING FOR GOOD NEWS FROM KCR REGARDING FILLING OF NOMINATED POSTS AK
Telangana: కేసీఆర్ మళ్లీ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు ?. ఆ నేతల ఎదురుచూపులు ?
సీఎం కేసీఆర్ (పైల్ ఫోటో)
TRS: పార్టీ కోసం పని చేసే వాళ్లకు కచ్చితంగా పదవులు వస్తాయని.. ఇందుకోసం ఓపికగా ఎదురుచూడాలని కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం తన వ్యూహాలను మారుస్తున్నారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ.. తమ పార్టీలోని అసంతృప్తి నేతలపై దృష్టి పెట్టడాన్ని గమనించిన గులాబీ బాస్.. అలాంటి నేతలు పార్టీ వీడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దివారాల క్రితం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి.. మరోసారి అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆచితూచి ముందుకు సాగుతోంది. కచ్చితమైన అవసరాలకు తోడు రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వాటిని భర్తీ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినేత నామినేటెడ్ పోస్టుల భర్తీని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. ఓ వైపు నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మరోవైపు పార్టీలోనూ పలువురు నేతలకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని.. ఆ రకంగా నేతలకు ప్రాధాన్యత కల్పిస్తారని కొంతకాలంగా చర్చ జరుగుతోంది.
పార్టీ కోసం పని చేసే వాళ్లకు కచ్చితంగా పదవులు వస్తాయని.. ఇందుకోసం ఓపికగా ఎదురుచూడాలని కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ ఈ అంశంపై సీరియస్‌గానే కసరత్తు చేస్తున్నారనే సంకేతాలు పార్టీ నేతలు, శ్రేణుల్లోకి వెళ్లాయి. మంచి రోజులు వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని పలువురు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు కొందరు.. ఎవరి స్థాయిలో వాళ్లు అధినాయకత్వంతో టచ్‌లో ఉండే నేతలతో లాబీయింగ్ మొదలుపెట్టారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే నామినేటెడ్ పోస్టుల భర్త సీఎం కేసీఆర్ పక్కాగా నివేదికలు తెప్పించుకున్న తరువాతే నిర్ణయాలు తీసుకుంటారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా ? అని అనేక మంది నేతలు ఎదురుచూస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.