టీఆర్ఎస్ నేతలు జనంలో... కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో: హరీశ్ రావు

కాంగ్రెస్ వాళ్లకు కుర్చీల గొడవ తప్పితే ప్రజల గోస పట్టదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడని ఆరోపించారు.

news18-telugu
Updated: November 8, 2018, 5:34 PM IST
టీఆర్ఎస్ నేతలు జనంలో... కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో: హరీశ్ రావు
సిద్ధిపేట సభలో మాట్లాడుతున్న హరీశ్ రావు
news18-telugu
Updated: November 8, 2018, 5:34 PM IST
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఉంటే... తెలంగాణ టీడీపీ నేతలు అమరావతిలో ఉన్నారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజల వద్దకు వెళుతున్నారని అన్నారు. వానాకాలం వస్తే ఉశిల్లు వస్తాయని... కాంగ్రెస్ వాళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని ఆరోపించారు. కాంగ్రెసోళ్లకు కుర్చీల గొడవ తప్పితే... ప్రజల గోస పట్టదని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ చంద్రబాబు చేతిలో పెడదామా అని ప్రశ్నించారు.

చంద్రబాబు కాంగ్రెస్ ముసుగు వేసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిద్ధిపేటలో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల్లో ఇప్పటివరకు తాను ఐదు సార్లు గెలిచానని... ఆయన ఆశీస్సులతోనే సిద్ధిపేటను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. సిద్ధిపేట అంటే మిమ్మల్ని గౌరవించే విధంగా చేశానని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

ఎంత ఎదిగినా ఒదగాలి అని కేసీఆర్ నేర్పిన విధంగా తాను నడుచుకుంటున్నానని అన్నారు. మంచి మెజార్టీతో సిద్ధిపేటను కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. మీరు నెల రోజులు కష్టపడితే... మీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడతానని హరీశ్ రావు ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...