Home /News /politics /

TRS LEADERS FIGHT IN WARANGAL KADIYAM SRIHARI SLAMS STATION GHANAPAUR MLA THATIKONDA RAJAIAH SK

Telangana: కడియం వర్సెస్ రాజయ్య... నువ్వెంతంటే నువ్వెంత.. టీఆర్ఎస్‌లో సీనియర్ల కొట్లాట..

కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య

కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య

Telangana: స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై మండిపడ్డారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఇంకా చదవండి ...
    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీలో బీజేపీ షాక్ తర్వాత.. మళ్లీ బిగ్ విక్టరీ సాధించడంతో కేడర్‌ సంబరాలు చేసుకుంటోంది. ఇలాంటి శుభ తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. నేతల మధ్య ఆధిపత్య పోరు చర్చనీయాంశమయింది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న రాజయ్య, కడియం శ్రీహరి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. గతంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శల తూటాలు పేల్చుతున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ.. మండిపడుతున్నారు. వీరిద్దరి వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


    స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై మండిపడ్డారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదు.. మగాళ్ళయితే ఆర్థిక సహాయం చేయాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరి దగ్గర చాయ్ తాగినా.. పనుల పేరుతో రూపాయి తీసుకున్నా.. ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. పదవులను, పనులను అమ్ముకుంటూ...మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నెత్తి మీద పది రూపాయలు పెడితే రూపాయికి కూడా అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు కడియం.

    ఇటీవలే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీలో గందరగోళం సృష్టించడానికి కొంత మంది కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఘనపుర్‌ గురించి మాట్లాడేవారికి అడ్రస్సే కాదు.. ఇక్కడ ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. కొన్ని గుంటన క్కలు గోతులు తవ్వుతున్నాయని... నోరుందని ఏదీపడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని రాజయ్య స్పష్టం చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరన్న ఆయన.. ప్రజా బలం ఓట్లతోనే తెలుస్తుందని పేర్కొన్నారు.

    రాజయ్య, కడియం శ్రీహరి. స్టేషన్ ఘనపూర్‌ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు. ఇద్దరూ సీనియర్లు. గతంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ కొన్నాళ్లుగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలోనూ పలు మార్లు వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం కలిసి పనిచేశారు. పార్టీ గెలుపు కోసం కృషిచేశారు. ఐతే మళ్లీ కొన్ని రోజులుగా వీరి మధ్య గ్యాప్ పెరుగుతోంది. అది మరింత పెరిగి.. రచ్చకెక్కింది. ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో విరుచుకుపడడంతో.. టీఆర్ఎస్ కేడర్‌లో అయోమయం నెలకొంది. మరి వీరిద్దరి ఫైటింగ్‌పై టీఆర్ఎస్ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kadiyam srihari, Telangana, Trs, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు