విభజన సమస్యలపై చర్చ జరగాలి: టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా

పార్లమెంట్‌ సమావేశాల్లో విభజన సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్లు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 4:32 PM IST
విభజన సమస్యలపై చర్చ జరగాలి: టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా
కేటీఆర్‌తో నామా నాగేశ్వరరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
విభజనచట్టం ప్రకారం తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న అంశాలను సమావేశాల్లో లేవనెత్తుతామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఎన్నో అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తులు అందజేసినా స్పందన లేదని నామా అన్నారు. తాము ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా... చేస్తాం అంటూ పనులను పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆక్షేపించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విభజన సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశాల్లో 27 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభుత్వం తరఫున జాబితా ఇచ్చారని నామా వివరించారు.

కేవలం బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా దేశంలోని ప్రజాసమస్యలపైనా చర్చ జరగాలని తాము కోరామని నామా తెలిపారు. వారానికి ఒక్కరోజైనా 193వ నిబంధన కింద ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినట్లు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై చర్చ జరగాలన్నారు. కొత్త రాష్ట్రానికి సహకారం అందించాల్సిన కేంద్రం.. అన్ని అంశాలను పెండింగ్‌లో పెడుతోందని నామా ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.


First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు