ఓటమి భయంతోనే డ్రామాలు..రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్

ప్రజాకూటమి నేతలపై ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కేటీఆర్.. టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.

news18-telugu
Updated: December 2, 2018, 6:33 PM IST
ఓటమి భయంతోనే డ్రామాలు..రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
కేటీఆర్ (File)
  • Share this:
తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసే ప్రజాకూటమి నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.

కొడంగల్‌లో ఓడిపోతానన్న భయంతోనే రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గెలిచే అవకాశం లేకపోవడంతో ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, మదిరలో భట్టి విక్రమార్కలు ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ స్థాయి నాయకుడు లేడన్న కేటీఆర్.. రాబోయే రోజుల్లో ఆంధ్రా రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటామని స్పష్టం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండబోదన్నారు. బీజేపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 2, 2018, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading