news18-telugu
Updated: May 26, 2019, 10:52 PM IST
మాజీ ఎంపీ కవిత (ఫైల్)
నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఓడిపోయిన కల్వకుంట్ల కవిత ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారా? అంటే ఔను అంటూ టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు లోక్సభకు గెలిచారు కాబట్టి, అసెంబ్లీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పకపోవచ్చు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఉత్తమ్ భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ తరఫునపోటీ చేసే అవకాశం ఉంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కోదాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో భర్త పోటీ చేసిన స్థానం ఖాళీ అయితే, అక్కడ నుంచి ఉత్తమ్ భార్య పోటీ చేయొచ్చు. అక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున కవితను పోటీకి దించే అవకాశం కూడా ఉందని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 26, 2019, 10:52 PM IST