టీఆర్ఎస్‌కు ‘తలాక్’ సంకటం...రాజ్యసభలో వ్యూహాం ఏంటి ?

Triple talaq bill in rajya sabha | ట్రిపుల్ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంతో టీఆర్ఎస్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: July 30, 2019, 12:47 PM IST
టీఆర్ఎస్‌కు ‘తలాక్’ సంకటం...రాజ్యసభలో వ్యూహాం ఏంటి ?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రంలోని అధికార బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో టీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో... టీఆర్ఎస్ అవసరం లేకుండానే దిగువ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. ఇక్కడ ఉండే ప్రతి సభ్యుడి ఓటు కీలక కావడంతో... టీఆర్ఎస్ పెద్దల సభలో ఎలా వ్యవహరిస్తుందనే అంశంపై అందరి చూపు నెలకొంది. ట్రిపుల్ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంతో టీఆర్ఎస్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేస్తుందా అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇటీవల రాజ్యసభలో ఆర్టీఐ సవరణల బిల్లు విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ పరోక్షంగా సహకరించిందనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ విషయంలో టీఆర్ఎస్ అదే రకంగా వ్యవహరిస్తుందా లేక బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే బిల్లును తమ ప్రసంగంలో వ్యతిరేకించి... ఓటింగ్ సమయంలో సభ నుంచి వాకౌట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ట్రిపుల్ తలాక్ విషయంలో టీఆర్ఎస్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.


First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...