కేకే బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. కొట్టి పారేస్తున్న టీఆర్‌ఎస్ వర్గాలు..

టీఆర్‌ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత పెద్ద నేతలు ఎవరు అంటే.. ఠక్కున్న గుర్తొచ్చే పేరు కే.కేశవరావు.  ఆయన సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేయనున్నట్లు..  సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం ఈ ప్రచారంలో నలుసంత నిజం కూడా లేదంటూ కొట్టిపారేస్తున్నాయి.

news18-telugu
Updated: October 17, 2019, 11:34 AM IST
కేకే బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. కొట్టి పారేస్తున్న టీఆర్‌ఎస్ వర్గాలు..
కేసీఆర్’తో కేశవరావు(Image/Facebook) (ఫైల్)
  • Share this:
టీఆర్‌ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత పెద్ద నేతలు ఎవరు అంటే.. ఠక్కున్న గుర్తొచ్చే పేరు కే.కేశవరావు.  ఆయన టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతారన్న  ప్రచారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే.. టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం ఈ ప్రచారంలో నలుసంత నిజం కూడా లేదంటూ కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ వెన్నెంటే ఉన్న కేకే.. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ చెబితే తప్ప.. కేకే ఏ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పరు. కానీ, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. ఇరు వర్గాలతో చర్చించేందుకు కేకే స్వయంగా తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకు వచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ జేఏసీ సానుకూలంగా స్పందించింది. కేకే ఆహ్వానిస్తే చర్చలకు వెళ్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామంతో ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య వాతావరణం కొంత చల్లబడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం కేసీఆరే ఆయనతో ఆ ప్రకటన చేయించారన్న ప్రచారం జరిగింది.

కానీ, ఆ మరుసటి రోజే.. కేకే వెనక్కి తగ్గారు. చర్చలు చేపట్టడానికి తానెవర్ని అంటూ షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే చర్చలకు దిగుతానని, అయితే ఇంకా ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకలేదని చెప్పారు. తన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు పెరిగాయని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యల వెనక ఎవరూ లేరని, సొంతంగానే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన.. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఖమ్మం వెళ్లి వచ్చారు. దీనివల్ల కార్మికుల వైపు కూడా తానున్నానని చెప్పకనే చెప్పారు.

ఈ నేపథ్యంలో కేకే వ్యాఖ్యల వెనక మరో మర్మం దాగి ఉందన్న ప్రచారం కూడా జోరందుకుంది. ముఖ్యంగా కేకే.. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో గుప్పుమంది. ఆయన రాజ్యసభ సభ్యత్వం మరో నాలుగు నెలల పాటే ఉండటం దీనికి కారణమని యూట్యూబ్ ఛానళ్ల లో సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.  నలుగురు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులతో సహా పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తారని వాళ్లు చెప్పడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే, కేకే టీఆర్‌ఎస్‌ను వీడుతారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ కథనాల్లో నలుసంత నిజం కూడా లేదంటూ స్పష్టం చేస్తున్నారు. అటు.. కేకే కూడా.. తాను టీఆర్‌ఎస్‌ను వీడే ప్రస్తకే లేదని, బీజేపీ సిద్ధాంతాలు తన రక్తంలో లేవని స్పష్టం చేశారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading