• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TRS FIELDS EX PM PV NARASIMHA RAOS DAUGHTER SURABHI VANI DEVI AS HYDERABAD RANGAREDDY MAHBOOBNAGAR GRADUATES MLC CANDIDATE BA

Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తె

Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తె

సురభి వాణీదేవి (File)

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ తరఫున సురభి వాణిదేవి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.

  • Share this:
    హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ తరఫున సురభి వాణిదేవి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. సురభి వాణిదేవి రేపు నామినేషన్ వేయనున్నారు. ఆమె భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె. శ్రీవేంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకురాలు. విద్యావేత్తగా, సామాజికవేత్తగా, చిత్రకారిణిగా వాణీదేవికి గుర్తింపు ఉంది. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఒకటి. రెండోది ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. హైదరాబాద్ విషయంలో మాత్రం చాలా ఆలోచించి చివరకు పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి పేరును ఖరారు చేసింది.

    పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత పీవీ శతజయంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు ఏడాదిపాటు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. అందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేె.కేశవరావు చైర్మన్‌గా ఉండగా, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ కుమార్తె సురభి వాణిదేవి కూడా సభ్యులుగా ఉన్నారు.

    మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గపరిధిలో మొత్తం 799 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక అల వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 24న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించనున్నారు. 26వ తేదీ వ‌ర‌కు ఉప‌సంహ‌ర‌ణ‌కు గడువు విధించారు. మార్చి 14న ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానంలో 5.60 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు.

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. మూడు పాత జిల్లాలతో కూడిన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ముఖ్యనేతలను, ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను, శ్రేణులను, పట్టభద్ర ఓటర్లు, మిత్రులను తన నామినేషన్‌ కార్యక్రమానికి ఆహ్వానించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు