Home /News /politics /

హుజూర్ నగర్‌లో కారు జోరు... భారీ మెజార్టీ దిశగా అడుగులు ?

హుజూర్ నగర్‌లో కారు జోరు... భారీ మెజార్టీ దిశగా అడుగులు ?

టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు

టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు

హుజూర్ నగర్‌లోనూ కారు వేగంగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్... ఏడవ రౌండ్ ముగిసే సమయానికి 14 వేలపైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఖాయమని అంతా భావించారు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిచినా... ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చని లెక్కలు వేసుకున్నారు. ఆర్టీసీ సమ్మె తీవ్రతరం కావడం... హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పట్టు ఉండటం కూడా ఇందుకు కారణం. అయితే ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైన కొద్ది సేపటికే... లెక్కలు మారిపోయాయి. హుజూర్ నగర్‌లోనూ కారు వేగంగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్... ఏడవ రౌండ్ ముగిసే సమయానికి 14 వేలపైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

    మరో 15 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉండటంతో... హుజూర్ నగర్‌లోనూ తమకు భారీ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి. కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే... తమకు 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఎవరెన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో తమకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని భావిస్తున్న టీఆర్ఎస్... ఈ ఉప ఎన్నిక ద్వారా మరోసారి తెలంగాణ రాజకీయాల్లో తాము ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నామని మరోసారి స్పష్టమైందనే భావనలో ఉంది.





    First published:

    Tags: CM KCR, Congress, Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Trs, Uttam Kumar Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు