అతి విశ్వాసమే కొంప ముంచింది... ఓటమిపై మాజీ ఎంపీ వినోద్ స్పందన

ఫలితాలపై ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విశ్లేషిస్తున్నామన్నారు. పోలింగ్‍ పూర్తయిన నాటి నుంచి.. కౌంటింగ్‍ రోజు వరకు విశ్లేషించామన్నారు.

news18-telugu
Updated: May 31, 2019, 2:38 PM IST
అతి విశ్వాసమే కొంప ముంచింది... ఓటమిపై మాజీ ఎంపీ వినోద్ స్పందన
వినోద్ కుమార్
news18-telugu
Updated: May 31, 2019, 2:38 PM IST

కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
తాజాగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన... ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. పుల్వామా దాడి, పైలెట్ అభినందన్ అంశాలు బీజేపీకి కలిసివచ్చాయన్నారు. ఈ ఎన్నికలు పెద్ద ఎత్తున తీర్పు చెప్పాయి. దీనికి గల కారణం జాతీయవాదమే అనిపిస్తుంది. మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిలో అత్యధికులు బీజేపీకే ఓటేశారు. దేశ వ్యాప్తంగా ఒకరకమైన జాతీయవాదం భావన నడుస్తోంది. యువత మోడీ ప్రధాని కావాలని కోరుకున్నారన్నారు.

ఏదో ఆశతో రాజకీయాల్లోకి రాలేదన్నారు వినోద్. ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‍ ఉద్యమ పార్టీ మాత్రమే కాదన్నారాయన. రాష్ట్ర సమస్యలు పరిష్కరించే వరకు ప్రజలతోనే ఉంటానన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామానికి .. ప్రతి ఓటరుకు అందుబాటులో ఉంటానన్నారు.కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని సూచించారు. గెలుపోటములు సమానంగా స్వీకరించాలన్నారు. ఫలితాలపై ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విశ్లేషిస్తున్నామన్నారు. పోలింగ్‍ పూర్తయిన నాటి నుంచి.. కౌంటింగ్‍ రోజు వరకు విశ్లేషించామన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చాను. స్మార్ట్ సిటీ వల్ల కరీంనగర్‌కు ఐదేళ్లలో వెయ్యి కోట్లు వస్తాయి. కరీంనగర్‌ను జాతీయ రహదారులతో అనుసంధానిస్తున్నాం. కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించడానికి కృషి చేశాను అని వినోద్ తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులకు అనుమతులు సాధించామన్నారు.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...