Home /News /politics /

TRS EX MP KAVITHA SHIFTING TO NEW HOUSE NEAR HYDERABAD OURSKIRTS AK

ఇల్లు మారిన కవిత... పార్టీ నేతలకు దూరం

మాజీ ఎంపీ కవిత (ఫైల్)

మాజీ ఎంపీ కవిత (ఫైల్)

నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కవిత తన పాత ఇంటి నుంచి ఫామ్ హౌస్‌కు మారిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.

    పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కూతురు కవితకు రాజ్యసభ సీటు దక్కుతుందా లేదా అన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవితకు రాజ్యసభకు పంపే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదనే ప్రచారం ఓ వైపు సాగుతుండగా... ఈ విషయంలో ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కవిత... పెద్దల సభకు వెళ్లే విషయంలో ఏ రకమైన ఆలోచనతో ఉన్నారనే వైఖరి పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ విషయంపై ఆమె పార్టీ నేతలతోనూ పెద్దగా మాట్లాడటం లేదనే వాదన వినిపిస్తోంది.

    ఇదిలా ఉంటే తాజాగా కవిత తన పాత ఇంటి నుంచి మారిపోయారనే వార్తలు కూడా వినిపిస్తోంది. గతంలో హైటెక్స్ సమీపంలో నివాసం ఉన్న కవిత... ప్రస్తుతం నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో నివాసం ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్నా... పార్టీ నేతలతో టచ్‌లో ఉండే కవిత... కొంతకాలంగా పార్టీ నాయకులతో కూడా పెద్దగా మాట్లాడటం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కవిత వైఖరి చూస్తుంటే... ఆమెకు రాజ్యసభ సీటు దక్కే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్న కవిత... మళ్లీ పొలిటికల్‌గా ఎప్పుడు యాక్టివ్ అవుతారనేది సస్పెన్స్‌గా కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Kalvakuntla Kavitha, Nizamabad, Rajya Sabha, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు