తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ఆహ్వానం అందింది. 2020 జనవరి 21న దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరింది. మార్పు కోసం విద్య (ఎడ్యుకేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్) అనే అంశంపై కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతూ ఉంటారు. కేవలం వ్యాపారపరమైన దృక్పథమే కాకుండా సామాజిక, విద్య, వైజ్ఞానిక అంశాలు కూడా ఇక్కడ చర్చిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు గతంలో కేటీఆర్కు కూడా ఆహ్వానం అందింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.