సీఎం కేసీఆర్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి గుడ్‌బై..?

సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాక్ ఇవ్వబోతున్నారా? టీఆర్‌ఎస్ పార్టీని వీడి సొంత పార్టీలోకి వెళ్లబోతున్నారా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి.

news18-telugu
Updated: January 28, 2020, 5:00 PM IST
సీఎం కేసీఆర్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి గుడ్‌బై..?
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాక్ ఇవ్వబోతున్నారా? టీఆర్‌ఎస్ పార్టీని వీడి సొంత పార్టీలోకి వెళ్లబోతున్నారా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. మహాబూబ్ నగర్‌ జిల్లా అంతటా దీని గురించే చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను కాదని, తన అనుచరులను వేరే పార్టీ నుంచి పోటీ చేయించి 11 మందిని గెలిపించుకున్న ఆయన.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన్ను సీఎం కేసీఆర్ పక్కనబెట్టారు. అప్పటి నుంచి పెద్దగా వార్తల్లో నిలవని జూపల్లి.. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా తన అనుచరులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం గమనార్హం. అదీ.. తానున్న టీఆర్‌ఎస్ కాకుండా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేశారు.

ఎన్నికలు ముగిశాక జూపల్లి హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలవాలనుకున్నారు. కానీ, అపాయింట్‌మెంట్ దొరకలేదు. రెండ్రోజుల పాటు ఆయన వేచి చూసినా సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలిసింది. దీంతో తాను పార్టీని వీడి సొంత పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే బెటర్ అని ఆయన అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీలోకి కూడా వెళ్తారని భావించినా.. తన బద్ధ శత్రువు డీకే అరుణ ఆ పార్టీలో ఉన్నందున తాను కాంగ్రెస్‌లోకి వెళ్తేనే మంచిదని ఆయన నిశ్చయించుకున్నట్లు కొల్లాపూర్ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు