TRS DRAFT MANIFESTO IS NOW AT KCR MANIFEST TO BE RELEASED IN TWO DAYS
రెండ్రోజుల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్
కేసీఆర్‌తో హరీశ్‌రావు (ఫైల్ ఫొటో)
అభ్యర్థుల ప్రకటన, టికెట్ల కేటాయింపు, నియోజకవర్గాల్లో ప్రచారం అన్నీ జరిగిపోయాయి టీఆర్ఎస్లో. ఇక మిగిలింది మేనిఫెస్టో రిలీజ్. ఊహాకల్పితంగా కాకుండా, వాస్తవాలకు దగ్గరగా ఉండేలా మేనిఫెస్టోని రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే, ప్రత్యర్థి పార్టీలు అత్యంత ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంశాలను ప్రచారంలో చెబుతుండటంతో, వాటికి దీటుగా మేనిఫెస్టో అంశాల్ని కేకే రూపొందించినట్లు సమాచారం.
టీఆర్ఎస్ మేనిఫెస్టో ముసాయిదాను పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు, పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించారు. శనివారమే ముసాయిదా ప్రతిని ఇవ్వాలనుకున్నా, ఆదివారం ఇచ్చి, కేసీఆర్‌తోపాటూ ప్రచారంలో పాల్గొనాలని కేకే భావించారు. ఆ ప్రకారమే ఇవాళ ఉదయం కేసీఆర్‌ని కలిసిన కేకే, డ్రాఫ్టు ప్రతులను అందజేశారు.
ఓ వైపు ప్రజాకూటమి నుంచీ కాంగ్రెస్ అత్యంత ఆకర్షణీయమైన హామీలు ఇస్తున్నా, అవి అమలు సాధ్యం కాని హామీలని చెబుతున్న టీఆర్ఎస్, తన మేనిఫెస్టోని మాత్రం సాదాసీదాగా రూపొందించినట్లు తెలిసింది. అమలు చేసేందుకు వీలుగా ఉండే హామీలను మాత్రమే అందులో పొందు పరచినట్లు సమాచారం. 2014లో మేనిఫెస్టోలో చెప్పని పథకాల్ని, కాలక్రమంలో అమలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈసారి కూడా ఇదే ఫార్ములాతో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పుడున్న పథకాల్ని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి కొనసాగించాలనుకుంటోంది. అందుకు తగినట్లుగానే మేనిఫెస్టో డ్రాఫ్టుని కేకే తయారుచేసినట్లు సమాచారం.
ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
ఉద్యోగ, వ్యాపార, సామాన్య వర్గాలు, వీఆర్ఓలు, వీఏఓలు, పంచాయతీ కార్యదర్శులు కేకేను కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కోరుకుంటున్న సేవలను వివరించారు. వాళ్లు ఇచ్చిన 400కు పైగా విజ్ఞాపన పత్రాలను లెక్కలోకి తీసుకొని, సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులతో చర్చించి మేనిఫెస్టోను కేకే రూపొందించారు. వీటన్నింటినీ సావధానంగా విన్న కమిటీ ఇప్పటికే ముసాయిదా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. దీన్ని కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి. ఇది ఫైనల్ అయిన తర్వాత, ప్రజల దగ్గరకు వెళ్తున్న అభ్యర్థులు, ఎన్నికల ప్రచారం ద్వారా మేనిఫెస్టో అంశాల్ని పదే పదే చెప్పాలని పార్టీ వర్గాలకు ముందుగానే ఆదేశించారు కేసీఆర్. ప్రచారానికి మరో 10 రోజులే టైమ్ ఉండటంతో పార్టీ నేతలు కూడా ఎంత త్వరగా మేనిఫెస్టో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.