GHMC Elections: హిందువుల ఓట్ల తొలగింపు.. సంజయ్ సంచలన ఆరోపణలు

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో హిందువుల ఓట్లను తొలగించారని ఆరోపించారు బండి సంయ్. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడంలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరారని ఆయన మండిపడ్డారు.

 • Share this:
  దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అందుకు తగ్గట్లే ప్రచారాన్ని హోరెత్తించింది. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చామని.. ఖచ్చితంగా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అదే ఊపుతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సీరియస్‌గా తీసుకుంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ముందు నుంచీ చెబుతున్న కాషాయ దళం.. కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా యాక్టివ్‌గా కనబడుతోంది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ అనుకూల ప్రాంతాల్లో హిందువుల ఓట్లను తొలిస్తున్నారని విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

  ''జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో డివిజన్లలో 45 నుంచి 50 వేల ఓట్లు ఉన్నాయి. బోలక్‌పూర్ 5 వేల ముస్లిం ఓట్లను పెంచారు. అంబర్ పేట ముస్లిం ఓట్లు 4 వేలు పెంచారు. చాంద్రాయణగుట్ట ఉప్పుగూడాలో 50 శాతం హిందువులు ఉంటే 45 శాతానికి తగ్గించారు. బోరబండలో 26 వేల హిందువుల ఓట్లను తొలగించారు. గోషామహల్‌లో 52357 ఓట్లు ఉంటే.. 15 వేల ఓట్లు తొలగించారు.'' అని పేర్కొన్నారు.

  ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో హిందువుల ఓట్లను తొలగించారని ఆరోపించారు బండి సంయ్. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడంలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఎన్నికలు ఎలా ప్రశాంతంగా జరుగుతాయిని ప్రశ్నించారు. హైదరాబాద్ మహా నగరాన్ని ఎంఐఎంకి అప్పగించి..ఏం చేద్దామనుకుంటున్నారని దుయ్యబట్టారు తెలంగాణ బీజేపీ చీఫ్. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని.. కేంద్రం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది, పాకిస్తాన్ నుంచి ముద్రించి తేవాలా ? అని ప్రశ్నించారు. సీఎం కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకు హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించామన్న ఆయన.. ఖచ్చితంగా తామే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: