హోమ్ /వార్తలు /రాజకీయం /

K Chandrashekar Rao: కేసీఆర్ నిర్ణయం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్

K Chandrashekar Rao: కేసీఆర్ నిర్ణయం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Rashtra Samithi: తమ జిల్లాకు అధ్యక్షుడయ్యే నాయకుడు ఎవరు అనే అంశంపై కూడా ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది ? ఎవరికి చెక్ పడుతుంది ? అని చెప్పడం చాలా కష్టం. అయితే ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా.. వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతారనేది మాత్రం సుస్పష్టం. తాజాగా టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలనే ఆలోచన.. గ్రామస్థాయి నుంచి కమిటీలు వేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాటి అమలు ఎప్పుడనే అంశానికి సంబంధించిన తేదీలను కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ నెలలో టీఆర్ఎస్ వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి కొత్త కార్యవర్గం ఏర్పాటు కావాలని నిర్ణయించిన కేసీఆర్.. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ రెడీ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అందుకు తగ్గట్టుగానే తేదీలను కూడా ప్రకటించారు.

టీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే నిర్ణయం మంచిదే అయినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు కొన్నేళ్లుగా జిల్లా పార్టీ అధ్యక్షులు లేరు. కొత్తగా అనేక జిల్లాలు ఏర్పడటంతో.. పార్టీ నాయకత్వం కూడా ఆ దిశగా ఆలోచించలేదు. అయితే ఇటీవల మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఇప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలకు ఇదే అంశంపై టెన్షన్ మొదలైనట్టు సమాచారం. తెలంగాణలోని చాలా జిల్లాలు ఇప్పుడు చిన్నగా ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పార్టీ నియమించే కొత్త అధ్యక్షులు ఎమ్మెల్యేలు సూచించిన వారే ఉంటారా ? అనే చర్చ జరుగుతోంది.

Huzurabad: ‘హుజూరాబాద్’ కోటాలో మరో రెండు పదవులు..ఆ ఇద్దరికి ఛాన్స్.. కేసీఆర్ ఆలోచన ?

ఇక జిల్లాలోని అందరి ఎమ్మెల్యేలు కలిసి కూర్చుని ఒకే నాయకుడి పేరును సూచిస్తారా ? అన్నది కూడా డౌటే. మరోవైపు అసలు జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల సలహాలు, అభిప్రాయాలు తీసుకుంటారా ? ఒకవేళ తీసుకున్నా వాటిని పరిగణనలోకి తీసుకునే తుది నిర్ణయం తీసుకుంటారా ? అనే చర్చ జరుగుతోంది. కొత్తగా జిల్లా పార్టీకి వచ్చే అధ్యక్షుడు తమపై పెత్తనం చేస్తే పరిస్థితి ఏమిటనే చర్చ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మొదలైనట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తమ జిల్లాకు అధ్యక్షుడయ్యే నాయకుడు ఎవరు అనే అంశంపై కూడా ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

First published:

Tags: CM KCR, Telangana, Trs

ఉత్తమ కథలు