నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్.. మరో నేతకు బుజ్జగింపులు

నోముల భగత్

టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.

 • Share this:
  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశానికి టీఆర్ఎస్ తెరదించింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. మరికాసేపట్లో ఆయనకు పార్టీ తరపున సీఎం కేసీఆర్ బీ ఫామ్ అందించబోతున్నారు. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపు ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మరో విధంగా న్యాయం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ద్వారా హామీ ఇప్పించనున్నట్టు సమాచారం.

  ఏప్రిల్ 17 నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 23న ఎన్నికల సంఘం నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగను్న తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరితో పాటు మే 2న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. నాగార్జునసాగర్ సీటు కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకు అసలు కారణం ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి గతంలో అనేకసార్లు గెలవడమే. ఇప్పుడు కూడా ఆయనే బరిలో ఉండటంతో ఈ సీటును కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపుగా ఖరారు కావడంతో.. టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
  Published by:Kishore Akkaladevi
  First published: