news18-telugu
Updated: November 19, 2020, 10:49 PM IST
ప్రతీకాత్మక చిత్రం
గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన మైలార్దేవర్ పల్లికి చెందిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్కు చెందిన వెంగళరావునగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో వెంగళరావునగర్ బీజేపీ అభ్యర్థిగా కిలారి మనోహర్ నిలువనున్నట్టుగా తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు.. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నారు. వీలైనంత వరకు బలమైన నాయకులను పార్టీలో చేర్చుకని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చెందిన పలువురు నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం(నవంబర్ 20) తేదీతో ముగియనుంది. దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో బీజిగా ఉన్నాయి. ఇక, జీమెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన దాఖాలైన నామినేషన్లను నవంబర్ 21న పరిశీలించనున్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక, డిసెంబర్ 1 జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 19, 2020, 9:47 PM IST