హోమ్ /వార్తలు /politics /

ఈఎస్ఐ స్కామ్‌తో సంబంధం లేదు... నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి వివరణ

ఈఎస్ఐ స్కామ్‌తో సంబంధం లేదు... నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి వివరణ

శ్రీనివాస రెడ్డి

శ్రీనివాస రెడ్డి

ESI Scam | ఈఎస్ఐ స్కాంలో తన పాత్ర ఉందని వస్తున్న వార్తలను మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఖండించారు.

  ఈఎస్ఐ స్కామ్‌తో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను జీహెచ్ఎంసీ కార్పొరేటర్, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఈఎస్ఐ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఈఎస్ఐ కమిటీ, యూనియన్‌లో తనకు సభ్యత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. తన మామ నాయిని కార్మిక మంత్రిగా పని చేశారనే తనపై ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయిన దేవికారాణితో తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆమెను తానెప్పుడూ కలవలేదని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తానెప్పుడూ ఈఎస్ఐ కార్యాలయానికి, యూనియన్ మీటింగ్‌కు వెళ్లలేదని వివరించారు. ఈఎస్ఐ మందుల వ్యవహారానికి సంబంధించిన తాను దుబాయ్ వెళ్లినట్టు నిరూపిస్తే... ఎటువంటి శిక్షకైనా సిద్ధమైని అన్నారు.

  అంతకుముందు ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి డైరెక్టర్‌ దేవికా రాణిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈఎస్‌ఐ మందుల స్కాంలో డైరెక్టర్‌ దేవికారాణితో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఫార్మాసిస్టు రాధిక, ఓమ్నీ మెడిసిన్‌ కంపెనీ ఎండీ శ్రీహరి, మరో ఇద్దరని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్‌ 11 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు తరలించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Esi scam, Nayini narasimha reddy, Trs

  ఉత్తమ కథలు