రామగుండంలో రచ్చ రచ్చ, కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

కార్పొరేటర్ సుజాత సమస్యలపై మాట్లాడుతుండగా మేయర్ అవమానపర్చిన్నట్లు మాట్లాడటంతో సమావేశం గందరగోళంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: October 21, 2020, 6:02 PM IST
రామగుండంలో రచ్చ రచ్చ, కౌన్సిల్ సమావేశంలో గందరగోళం
రామగుండం కౌన్సిల్ సమావేశంలో రసాభాస
  • Share this:
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన 14 వ ఆర్థిక సంఘం నిధులు, దసరా ఏర్పాట్ల పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డివిజన్లలో సమస్యలు పెరిపోయాయని, సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని కాంగ్రెస్, బీజేపీ, కార్పొరేటర్లు పోడియం ను ముట్టడించారు.

కాంగ్రెస్ కార్పోరేటర్ బొంతల రాజేశ్ మాట్లాడుతూ, దసరా పండగా పేరటా రూ.50 లక్షలు ఎందుకు కేటాయించారని, కాంట్రాక్టర్లు లబ్ధిపోందడానికేనని ఆరోపించారు. కార్పొరేటర్ సుజాత సమస్యలపై మాట్లాడుతుండగా మేయర్ అవమానపర్చిన్నట్లు మాట్లాడటంతో సమావేశం గందరగోళంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మేయర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం ఎదుట ఆందోళనకు దిగారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 21, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading