టీఆర్ఎస్‌కు బీజేపీ టెన్షన్... మాజీలకు ప్రయారిటీ ?

బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలెవరూ వెళ్లే అవకాశం లేదని గట్టిగా చెబుతున్న ఆ పార్టీ నాయకత్వం... ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: September 3, 2019, 6:36 PM IST
టీఆర్ఎస్‌కు బీజేపీ టెన్షన్... మాజీలకు ప్రయారిటీ ?
కేసీఆర్, అమిత్ షా(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 3, 2019, 6:36 PM IST
తెలంగాణలో బలపడేందుకు వలసలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన బీజేపీ... వీలైనంత ఎక్కువమంది నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీటీడీపీ నేతలను తమ వైపు తిప్పుకుంటున్న బీజేపీ నేతలు... టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలపై కూడా దృష్టి పెట్టినట్టు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలెవరూ వెళ్లే అవకాశం లేదని గట్టిగా చెబుతున్న ఆ పార్టీ నాయకత్వం... ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వేరే పార్టీ ఎమ్మెల్యేలున్న చోట తమకు ప్రాధాన్యత లేదని కొందరు ఫిర్యాదులు వస్తున్న తరుణంలో.. నియోజకవర్గ ఇంఛార్జులకు కొత్త మార్గదర్శకాలకు జారీ చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ సమావేశాలు అన్నింటికీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విధిగా పిలవాలని టీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. సభ్యత్వ నమోదును పూర్తి చేసుకున్న టిఆర్ఎస్ .... వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అదే సమయంలో పార్టీలో అన్ని స్థాయిల నేతలు కలిసి ముందుకు వెళ్లేలా చూస్తోంది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా సమావేశాలకు ఆహ్వనించాల్సిందిగా టీఆర్ఎస్ నేతలకు సూచించింది. నియెజకవర్గ స్థాయిల్లో జరిగే సమావేశాలకు వీరిని కచ్చితంగా ఆహ్వానించాల్సిందిగా పార్టీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. .అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆయా నియెజకవర్గాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ సమావేశాలకు కచ్చితంగా వారిని కూడా పిలవాలని పార్టీ సూచించింది. అన్ని నియెజకవర్గాల్లో ఫాలో అయ్యేలా చూడాలని పార్టీ నియెజకవర్గ ఇంఛార్జ్‌లకు టీఆర్ఎస్ స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో నేతల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోంటోంది టీఆర్ఎస్ అధిష్టానం. పార్టీలో మాజీలకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయం రాకుండా టిఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీకి ఇబ్బంది కల్గించకుండా కలిసి ముందుకు సాగాలని నేతలకు స్పష్టం చేస్తోంది టిఆర్ఎస్.



First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...