జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేసీఆర్ మెగా ప్లాన్, ప్రతిపక్షాలు దుబ్బాకలో బిజీగా ఉంటే

2016లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 150 సీట్లకు టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు రాబట్టాలంటే ఏం చేయాలనే అంశంపై టీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

news18-telugu
Updated: October 25, 2020, 3:53 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేసీఆర్ మెగా ప్లాన్, ప్రతిపక్షాలు దుబ్బాకలో బిజీగా ఉంటే
కేసీఆర్(ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మహానగరంలో భారీ వరదల వల్ల ప్రజలు కష్టపడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు. గ్రేటర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరేసేలా తమ పట్టు నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ అధినేత ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకోసం కేసీఆర్ ఎంచుకున్న మార్గం. యువత. పార్టీలో ఈసారి యువతను టార్గెట్‌గా చేసుకుని ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి డివిజన్‌లోనూ ఉత్సాహంగా, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే యువ నాయకులను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలో కేసీఆర్ రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ యువనాయకత్వంతో చర్చించినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాల్లో వారంతా చురుకుగా పాల్గొంటున్నారా? లేదా? అనే అంశాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ లెవల్లో పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ దూరం కావొద్దని సూచించారు. ఎవరైనా అలాంటి వారు ఉంటే తమ వైఖరి మార్చుకుని మళ్లీ యాక్టివ్ కావాలని ఆదేశించారు. అలాగే, ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారితో సుమారు ఆరు గంటల పాటు చర్చించినట్టు తెలిసింది. కేవలం కొద్దిసేపు కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని భావించిన ఆ యువ కేడర్ ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడంతో టీఆర్ఎస్ యువ నాయకత్వంలో కొత్త ఉత్సాహం వచ్చిందని గులాబీ నేతలు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఉధృతంగా పనిచేయాలని, ముఖ్యంగా అన్నిచోట్లా మెంబ‌ర్ షిప్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అలా చేసే వారికి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు లభించే అవకాశం కూడా ఉందని వారిలో ఆశలు చిగురింపజేశారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లోనూ యువతను కేంద్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని, యువత పార్టీ వైపు ఉండేలా చేయాలని వారికి సూచించారు. కొత్తవారిని పార్టీలోకి తీసుకురావాలని, రికార్డు స్థాయిలో మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వృద్ధ నేతలను పక్కన పెట్టి యువతకు టికెట్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

2016లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 150 సీట్లకు టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకుంది. అయితే, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్‌లోని మూడు లోక్‌సభ సీట్లలో ఓడిపోయింది. హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటమి చెందింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రతిభను కనబరిచినా, లోక్‌సభకు వచ్చేసరికి సీన్ మారింది. అదే క్రమంలో 2016 నుంచి జీహెచ్ఎంసీలో నేతల మధ్య వచ్చిన గ్యాప్‌ను తగ్గించేందుకు, యువతకు బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది.

ఈ ఏడాది నవంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగవచ్చని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వాటిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఖండించారు. జీహెచ్ఎంసీ ఎప్పుడంటే అప్పుడు తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. అయితే, ఇటీవల వచ్చిన వరదలు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్లోబల్ సిటీ గార్బేజ్ సిటీ అయిపోయిందంటూ ప్రతిపక్షాలు టీఆర్ఎస్ సర్కారు మీద విరుచుకుపడుతున్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 25, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading