మహారాష్ట్ర ఎన్నికల బరిలో టీఆర్ఎస్? కేసీఆర్‌తో ప్రజాప్రతినిధుల భేటీ

మహారాష్ట్రలో టీఆర్ఎస్ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పిన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: September 17, 2019, 6:18 PM IST
మహారాష్ట్ర ఎన్నికల బరిలో టీఆర్ఎస్? కేసీఆర్‌తో ప్రజాప్రతినిధుల భేటీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 17, 2019, 6:18 PM IST
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు కొంతకాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ గ్రామాలను తెలంగాణలో విలీనం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు మహారాష్ట్ర రైతులు ఉద్యమబాట పట్టారు. నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలు పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో కేసీఆర్‌కు విన్నవించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీఎంని కలిసిన వారిలో నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు.

మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ తెలంగాణతో పోలిస్తే మా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రైతులు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అందుతోంది. నిరుపేద వృద్ధులకు 2వేల పెన్షన్ ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఇలాంటివేవీ లేవు. అందుకే మా గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నాం.
మహారాష్ట్ర రైతులు


త్వరలోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి, శివసేన, ఎన్సీపీ పార్టీలకు చెందిన స్థానిక నేతలతో వచ్చి సీఎం కేసీఆర్‌ని కలుస్తామని చెప్పారు. నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్నినియోజకవర్గాల ప్రజలతో పాటు బీవండి, షోలాపూర్, రజూర ప్రాంతాల నుంచి టిఆర్ఎస్ టికెట్ కావాలని అడుగుతున్నట్లు వారి వెల్లడించారు. ఐతే మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, రైతుల విజ్ఞప్తిని విన్న కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో టీఆర్ఎస్ ఏర్పాటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పిన్నట్లు సమాచారం.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...