Nagarjuna Sagar By Election Result: నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం.. మెజార్టీ ఎంతంటే..

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Nagarjuna Sagar By Election Result: సాగర్ ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపులో భాగంగా టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది.

  • Share this:
    తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం దాదాపు ఖాయమైంది. సాగర్ ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపులో భాగంగా టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ తన సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై 18,449 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 87,254 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 68,805 ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇక తెలంగాణలో బలం పుంజుకుంటున్నట్టు కనిపించిన బీజేపీ.. సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. టీఆర్ఎస్ విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నోముల భగత్.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన సాగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో సాగర్‌లో కచ్చితంగా విజయం సాధించాలని భావించిన టీఆర్ఎస్.. అందుకు తగ్గట్టుగా పావులు కదిపింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ఉప ఎన్నికల అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేు, ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో దిగి పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఇక ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. సాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం.. ఆయనే బరిలో ఉండటంతో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాగింది. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన బీజేపీ.. నాగార్జునసాగర్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
    Published by:Kishore Akkaladevi
    First published: