భువనగరిలో అందుకే ఓడిపోయాం...బూర ఓటమిపై పైళ్ల కామెంట్స్

బూరనర్సయ్య గౌడ్ గెలుపు కోసం అందరం కష్టపడ్డామని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన ఓడిపోయారని చెప్పారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: May 28, 2019, 8:21 PM IST
భువనగరిలో అందుకే ఓడిపోయాం...బూర ఓటమిపై పైళ్ల కామెంట్స్
బూర నర్సయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి
  • Share this:
భువనగిరిలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూరనర్సయ్య గౌడ్‌ ఓటమికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డే కారణమన్న ప్రచారంపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర నర్సయ్యగౌడ్‌ ఓడిపోవడం చాలా బాధాకరమన్న పైళ్ల.. ఇది కలలో కూడా ఉహించలేదని అన్నారు. రోడ్డు రోలర్ గుర్తు వల్లే భువనగిరిలో ఓడిపోయాం తప్ప వేరే కారణం లేదని స్పష్టంచేశారు. బూర ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రోడ్డు రోలర్ గుర్తు వల్లే భువనగిరిలో ఓడిపోయాం. సామాజిక మాధ్యమాల్లో నాపై అసత్య ప్రచారం జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ హోటల్‌ వద్దకు వస్తే అక్కడే ఉన్న నన్ను కాకతాళీయంగా కలిశారు. ఇందులో రహస్యమేమీ లేదు. అందరూ అక్కడే ఉన్నారు. మా మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. బొమ్మల రామారం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా చిత్రీకరించి నాపై దుష్ప్రచారం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే


బూరనర్సయ్య గౌడ్ గెలుపు కోసం అందరం కష్టపడ్డామని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన ఓడిపోయారని చెప్పారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తన మీదే ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు పైళ్ల.

భువనగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఐతే 5,219 ఓట్ల స్పల్ప మెజార్టీతోనే ఆయన గెలుపొందారు. భువనగరిలో మొత్తం 12,12,631 పోలయ్యాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5,32,795 ఓట్లు పడగా...నర్సయ్యగౌడ్‌కు 5,27,576 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 65,457, సీపీఐ అభ్యర్థికి 28,153 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో అనూహ్యంగా సింగపాక లింగంకు 27,973 ఓట్లు పోలయ్యాయి.

లింగంకు ఎన్నికల అధికారులు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. అది ఇంచుమించు కారు గుర్తును పోలి ఉంటుంది. ఈవీఎంలోని బ్యాలెట్ యూనిట్‌పై కారు గుర్తు పైనుంచి మూడోది కాగా.. రోడ్డురోలర్ కింద నుంచి మూడోదిగా ఉంది. ఈ క్రమంలో చాలా మంది వృద్ధులు రోడ్డురోలర్‌ని కారుగా భావించి ఓటువేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు దెబ్బతీయగా.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్డురోలర్ టీఆర్ఎస్‌ను ఓడించిందని వాపోతున్నారు.
First published: May 28, 2019, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading