
ప్రతీకాత్మక చిత్రం
ఒక రోజుకు మూడు షిఫ్టుల చొప్పున, మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. ఒక షిఫ్టుకు ఇద్దరు కార్యకర్తలు కాపలాగా ఉంటారు.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు కాపలా ఉండాలని నిర్ణయించారు. మే 23న ఎన్నికల ఫలితాలు ముగిసే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాపలా కాయాలని నిర్ణయించారు. ఒక రోజుకు మూడు షిఫ్టుల చొప్పున, మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. ఒక షిఫ్టుకు ఇద్దరు కార్యకర్తలు కాపలాగా ఉంటారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలు విడతల వారీగా గస్తీ కాయనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు చిత్తారు సింహాద్రి యాదవ్, మందపాటి వెంకటేశ్వర రావు, పాల్వంచ రాజేష్, భార్గవ్, సరిపూడి గోపి, చీకటి రాంబాబుకు విధులు కేటాయించినట్టు తెలిసింది. ఖమ్మం లోక్సభ స్థానానికి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరఫున రేణుకా చౌదరి బరిలో దిగారు. ప్రధాన పోటీ వారి మధ్యే ఉండనుంది. అయితే, టీఆర్ఎస్ ప్రత్యేక గస్తీపై ఈసీ వర్గాలు ఏమంటాయనేది చూడాలి.
First published:April 17, 2019, 17:51 IST