Sagar Exit Poll: సాగర్ లో ‘కారు’ జోరు.. ‘ఆరా’ ఎగ్జిట్ పోల్ సర్వే లో వెల్లడి..

సీఎం కేసీఆర్, నోముల భగత్ (ఫైల్ ఫోటో)

Sagar Exit Poll: నాగార్జునసాగర్‌ స్థానాన్ని మళ్లీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే తేల్చి చెప్పింది. కాంగ్రెస్ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానం కైవసం చేసుకుంటుందని వెల్లడించింది.

  • Share this:
    తెలంగాణలో నోముల నోముల నర్సయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే దీనిని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఏప్రిల్ 17 న పోలింగ్ జరగ్గా టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ రవి నాయక్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ‘ఆరా’ సర్వే వెల్లడించింది. పోలైన ఓట్లలో ఎవరికీ ఎంత శాతం ఓట్లు రావచ్చో అంచనా వేసి చెప్పింది. ఆరా పోస్ట్ పోల్ సర్వేలో అధికార టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రెండో స్థానంలో కాంగ్రెస్ కు 39.93 శాతం, మూడో స్థానంలో బీజేపీ కి 6.31 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఓట్ల శాతం ఆధారంగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని టీఆర్ఎస్ సర్వే ప్రకారం అలాగే నిలబెట్టుకుంటుందా.. లేదా అనేది మే 2 న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది.
    Published by:Veera Babu
    First published: