హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు

త అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

news18-telugu
Updated: September 23, 2019, 12:51 PM IST
హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు
సీఎం కేసీఆర్, కారు గుర్తు
news18-telugu
Updated: September 23, 2019, 12:51 PM IST
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖారారు చేసింది అధిష్టానం.శానంపూడి సైదిరెడ్డి పేరును సిఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ శనివారం మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సిఎం నిర్ణయించారు. హుజూర్‌నగర్ నగారా మోగింది. వచ్చే నెల 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 24న కౌంటింగ్ జరగనుంది.

శానంపూడి సైదిరెడ్డి (ఫైల్ ఫోటో)


అయితే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాదు పెద్ద అగ్నీపరీక్ష కూడా కానుంది. ముఖ్యంగా అటు అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు... ఇటు విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా హుజూర్ నగర్‌లో ఎలా అయిన పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా మారిన హుజూర్ నగర్‌లో ఎలా అయిన గెలవాలని అధికార పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎన్నారై సైదిరెడ్డి స్వల్ప మెజార్టీ తేడాతో ఓడిపోయారు.తిరిగి ఆయననే ఉప ఎన్నికలో కూడా నిలబెట్టాలని నిర్ణయించారు గులాబీ బాస్.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...