పంతం నెగ్గించుకున్న టీఆర్ఎస్... అక్కడ గులాబీ రెపరెపలు...

నిజామాబాద్ కార్పొరేషన్‌ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి దండు నీతో కిరణ్, డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ ఇద్రిస్ ఖాన్ ఎన్నికయ్యారు.

news18-telugu
Updated: January 27, 2020, 3:45 PM IST
పంతం నెగ్గించుకున్న టీఆర్ఎస్... అక్కడ గులాబీ రెపరెపలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ కార్పొరేషన్‌ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లో 60 డివిజన్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బీజేపీ 28 స్థానాలు, ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 34 ఉండాలి. బీజేపీకి 28, ఎంపీ అరవింద్ ఎక్స్ అఫీషియో కలుపుకొని మొత్తంగా 29కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ సరిపోకపోవడంతో అపోజిషన్లో ఉంటామని ఎంపీ అరవింద్ ప్రకటించారు. అటు టీఆర్ఎస్ పార్టీకి 13, ఎంఐఎం 16, ఒక ఇండిపెండెంట్, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు, ఎక్స్అఫిషియో ఓట్లు టీఆర్ఎస్ కు 6 ఉన్నాయి. ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్ లు ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో టీఆర్ఎస్ బలం 38కి చేరింది. మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా 11వ వార్డు దండు నీతో కిరణ్, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం అభ్యర్థి 14వ వార్డు మహమ్మద్ ఇద్రిస్ ఖాన్ ఎన్నికయ్యారు. మొత్తంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. మూడో స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 27, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading