Home /News /politics /

TRS AND BJP LEADERS ARE TAKING SELFIES AND CRITICIZING EACH OTHER ON THE PERFORMANCE OF BOTH THE CENTRAL AND STATE GOVERNMENTS IN ADILABAD ADB PRV

Adilabad CCI: ఆదిలాబాద్​లో వేడెక్కుతున్న రాజకీయాలు.. సీసీఐ కేంద్రంగా టీఆర్​ఎస్​ సెల్ఫీ వార్.. ఇరుకున పడుతున్న బీజేపీ నేతలు

ఐ లవ్​ సీసీఐ అంటున్న జోగు రామన్న

ఐ లవ్​ సీసీఐ అంటున్న జోగు రామన్న

ప్రతిసారి ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలు సిసిఐ అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ తర్వాత వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇప్పుటికిప్పుడే ఎన్నికలు ఏమి లేనప్పటికి సిసిఐ పునరుద్దరణ అంశం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

    (కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

    ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని మూత పడిన సిమెంట్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (CCI) సిమెంట్ పరిశ్రమ పునరుద్దరణ అంశం రాజకీయ రగడకు కారణమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం మూతపడిన ఈ పరిశ్రమను పున:ప్రారంభించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రతిసారి ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలు సీసీఐ (Adilabad CCI) అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ తర్వాత వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇప్పుటికిప్పుడే ఎన్నికలు ఏమి లేనప్పటికి సీసీఐ పునరుద్దరణ (CCI Renewal) అంశం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే జిల్లా కేంద్రంలో సుమారు 772 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమ 170 ఎకరాల టౌన్ షిప్, 1500 ఎకరాలలో సుమారు 48 మిలియన్ టన్నుల లైన్ స్టోన్ నిల్వలను కలిగి ఉంది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ లోని సీసీఐ (Adilabad CCI) పరిశ్రమ పునరుద్దణపై ఆసక్తి చూపకపోవడం అటకెక్కింది. తాజాగా సీసీఐ పరిశ్రమ పున:రుద్దరణ (CCI Renewal) డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

    అనుకూల ప్రకటన ఇప్పించేందుకు..

    సీసీఐ  (Adilabad CCI) సిమెంట్ పరిశ్రమ పునరుద్దరణ లక్ష్యంగా సీసీఐ సాధన సమితి కూడా ఆవిర్భవించింది. దాని ఆధ్వర్యంలో పలు ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీసీఐ పరిశ్రమ పున:ప్రారంభం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుకూలమైన ప్రకటన ఇప్పించేందుకు టీఆర్ఎస్, బీజేపీ నేతలు పాట్లు పడుతున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు ఒకడుగు ముందుకు వేశారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్​ దీనిపై ఓ ప్రకటన కూడా చేయించారు. టీఆర్ఎస్ నేతలు కూడా సిసిఐ  (Adilabad CCI) పున:రుద్దరణకు సిసిఐ సాధన సమితితో కలిసి పనిచేయడంతోపాటు విడిగా కూడా ఆందోళనలు చేపడుతోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగు రామన్న సోషల్ మీడియా వేదికగా సరికొత్త సెల్ఫీవార్ కు తెరలేపారు.

    టీఆర్ఎస్ ఐ  లవ్ సీసీఐ..

    జిల్లా కేందంలోని ప్రధాన చౌరస్తాలో ఐ లవ్ సీసీఐ ( I Love CCI) అని రాయించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, దాని వద్ద సెల్ఫీ (TRS Selfie) తీసుకుంటూ పోస్టు చేస్తున్నారు. లక్ష సెల్ఫీలు, కోటి సంతకాలు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల టీఆర్ఎస్ తరఫున పోటిచేసి ఎమ్మెల్సీగా గెలుపొందిన దండె విఠల్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిసి సెల్ఫీ పాయింట్ ను సందర్శించి తన సంఘీభావం తెలిపారు.

    సెల్ఫీ విత్ కేసీఆర్ ఫెయిల్యూర్స్​..

    ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి కౌంటర్ గా బీజేపీ నాయకురాలు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి సెల్ఫీ విత్ కేసీఆర్ ఫెయిల్యూర్స్​ అనే వినూత్న నిరసన కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కేసీఆర్​ నెరవేర్చలేకపోయిన హామీలను ఎత్తి చూపుతూ నిరుద్యోగులు తదితరులతో సెల్ఫీలు తీయిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసంపూర్తి డబుల్ బెడ్ రూంలతో కూడా సెల్ఫీలు దిగుతూ పోస్టు చేస్తున్నారు. పోటా పోటీ నిరసనలు, ఆందోళనలతో ఆదిలాబాద్ లో రాజకీయం వేడెక్కింది. రానున్న రోజుల్లో ఈ ఆందోళనలు, నిరసనలు ఎన్ని కొత్తపోకడలు పోతోందో చూడాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Bjp, Cement, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు