రేవంత్ రెడ్డికి మళ్లీ కష్టాలు... ఆ పదవి చేజారుతుందా ?

ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత టీ పీసీసీ చీఫ్ దక్కించుకునే వారి రేసులో అందరికంటే ముందున్న రేవంత్ రెడ్డికి మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు గట్టి పోటీ చేస్తున్నారు.

news18-telugu
Updated: March 2, 2020, 1:04 PM IST
రేవంత్ రెడ్డికి మళ్లీ కష్టాలు... ఆ పదవి చేజారుతుందా ?
అయితే స్వామి గౌడ్ తరహాలో టీఆర్ఎస్‌లోని అసంతృప్తిగా ఉన్న నేతలను తనవైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
  • Share this:
మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ దందా వ్యవహారాలతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి కలిసి హైదరాబాద్ శివార్లలో భూ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసులు నమోదు చేసే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా తన రాజకీయ కార్యక్రమాలతో తాను ముందుకు సాగిపోతున్నారు రేవంత్. అయితే ఆయనపై వస్తున్న ఆరోపణలు ఆయనకు మరోసారి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని... ఆయన కోరుకున్న పదవిని దూరం చేసే అవకాశం లేకపోలేదనే ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత టీ పీసీసీ చీఫ్ దక్కించుకునే వారి రేసులో అందరికంటే ముందున్న రేవంత్ రెడ్డికి మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు గట్టి పోటీ చేస్తున్నారు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీమంత్రి శ్రీధర్ బాబు వంటి వాళ్లు టీ పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే ఈసారి టీ పీసీసీ చీఫ్ పదవి తనకే దక్కుతుందన్న ధీమాలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేందుకు ఆయన ముందుకు సాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా ఆయనపై వస్తున్న ఆరోపణలు... కాంగ్రెస్‌లోని ఆయన పోటీదారులకు వరంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటు కేసు ద్వారా ఇబ్బందిపడ్డ రేవంత్ రెడ్డి మరోసారి కేసుల్లో ఇరుక్కోవడంతో ఇతర పార్టీలకు, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నారని... అలాంటి వ్యక్తికి టీ పీసీసీ చీఫ్ ఇవ్వొద్దని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ పీసీసీ చీఫ్ పదవి ఆయనకు దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: March 2, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading