Home /News /politics /

సీఎం జగన్ వ్యూహం.. చంద్రబాబుతో పాటు లోకేష్ మెడకు ఉచ్చు

సీఎం జగన్ వ్యూహం.. చంద్రబాబుతో పాటు లోకేష్ మెడకు ఉచ్చు

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

ఫైబర్ గ్రిడ్ మీద సీబీఐ విచారణ జరిపితే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ మెడకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది.

    టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ కేబినెట్ దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో చంద్రబాబు హయాంలో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మన్ కానుక వంటి పథకాల మీద సమగ్ర విచారణ జరిపిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. అందులో ఫైబర్ గ్రిడ్‌లో సుమారు రూ.700 కోట్లు అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న కానుక వంటి స్కీంల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని ఉపసంఘం తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు అని తెలిపింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపైనా సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. వీటిపై చర్చించిన ఏపీ కేబినెట్ చంద్రబాబు హయాంలో అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించింది.

    దీనిపై సీబీఐ విచారణ జరిపితే అది కేవలం చంద్రబాబు ఒక్కడితోనే అయిపోదు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఐటీ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రుల మెడకు కూడా చుట్టుకుంటుంది. చంద్రబాబు హయాంలో నారా లోకేష్ కూడా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు పల్లె రఘునాధరెడ్డి ఐటీ శాఖ బాధ్యతలు చూశారు. లోకేష్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఐటీ శాఖ పగ్గాలు ఆయనకు అప్పగించారు చంద్రబాబు. ఇక పౌరసరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత పనిచేశారు. చంద్రన్న కానుకలు అన్నీ పౌరసరఫరాల శాఖ ద్వారానే పంపిణీ జరిగాయి. ఈ క్రమంలో ఆమె మెడకు కూడా ఉచ్చు బిగుస్తున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు