కర్ణాటకలో రోజులు లెక్క పెడుతున్న జేడీఎస్ సంకీర్ణ సర్కార్..

ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటక సంకీర్ణ సర్కార్ బలం 115కి పడిపోయింది. పార్టీని వీడే యోచనలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో..కర్ణాటక సర్కార్‌ ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: July 1, 2019, 6:54 PM IST
కర్ణాటకలో రోజులు లెక్క పెడుతున్న జేడీఎస్ సంకీర్ణ సర్కార్..
సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్ధరామయ్య (ఫైల్)
  • Share this:
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి.తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జర్కిహోళి తమ పదవులకు రాజీనామా చేశారు.ఆనంద్ సింగ్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించిన కొద్ది గంటలకే
రమేష్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు అందించారు. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్రలతో బీజేపీయే 'ఆపరేషన్ కమల్'కు తెరలేపిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.తన నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను జిందాల్ కంపెనీకి కట్టబెట్టడంపై అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ సింగ్ ప్రకటించారు. రమేష్ జర్కిహోళి మాత్రం తన రాజీనామాపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 225 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్-జేడీఎస్ బలం 117 స్థానాలు.అంటే, మేజిక్ ఫిగర్ కంటే కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అదనంగా ఉన్నారు. తాజాగా ఇద్దరు రాజీనామా చేయడంతో ప్రభుత్వ బలం 115కి పడిపోయింది. పార్టీని వీడే యోచనలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో..కర్ణాటక సర్కార్‌ ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి మాత్రం ప్రభుత్వం కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలు కలలుగానే మిగిలిపోతాయని చెప్పారు. కుట్రలను చేధించి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని ధీమాగా చెప్పారు.First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>