ఊర్మిళ మండోట్కర్ పెళ్లికి ముందే మతం మార్చుకుందా? ఆరోపణల్లో నిజమెంతా?

ఊర్మిళ కాశ్మీర్ బిజినెస్ మ్యాన్, మోడల్ అయిన మోసిన్ అక్తర్ మిర్‌ను 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే నిఖా సమయంలో ఊర్మిళ తన పేరును మరియమ్ అక్తర్‌ మిర్‌గా మార్చుకున్నారని.. ఆమె ఇస్లాం మతం స్వీకరించారని నెటిజన్లు పోస్టులు పెట్టారు.

news18-telugu
Updated: March 31, 2019, 10:15 AM IST
ఊర్మిళ మండోట్కర్ పెళ్లికి ముందే మతం మార్చుకుందా? ఆరోపణల్లో నిజమెంతా?
ఊర్మిళ కాశ్మీర్ బిజినెస్ మ్యాన్, మోడల్ అయిన మోసిన్ అక్తర్ మిర్‌ను 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే నిఖా సమయంలో ఊర్మిళ తన పేరును మరియమ్ అక్తర్‌ మిర్‌గా మార్చుకున్నారని.. ఆమె ఇస్లాం మతం స్వీకరించారని నెటిజన్లు పోస్టులు పెట్టారు.
  • Share this:
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మంటోడ్కర్ కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం ఊర్మిళా మంటోడ్కర్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి ఆన్లైన్ లో చాలా మంది ఆమె పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఫేస్బుక్ పోస్ట్ లో ఆమె RSS అధినేత మోహన్ భగవత్ మేన కోడలు అని ఆరోపించారు . మరో పోస్ట్ లో ఆమె ఒక ముస్లిం ని పెళ్లి చేసుకునే సమయంలో తన మతం మరియు పేరు మార్చుకున్నారని విమర్శలు చేవారు. అయితే నెటిజన్లు చేస్తున్న ఈ ఆరోపణల్లో వాస్తవమెంతా ?
నిజంగా ఊర్మిళా మతం మార్చకున్నారా ? ఆమె పేరు కూడా మార్పు చేసుకున్నారా ? అంటే మాత్రం కుటుంబసభ్యులు కన్నెర్ర చేస్తూన్నారు.

ఊర్మిళ కాశ్మీర్ బిజినెస్ మ్యాన్, మోడల్ అయిన మోసిన్ అక్తర్ మిర్‌ను 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే నిఖా సమయంలో ఊర్మిళ తన పేరును మరియమ్ అక్తర్‌ మిర్‌గా మార్చుకున్నారని.. ఆమె ఇస్లాం మతం స్వీకరించారని నెటిజన్లు పోస్టులు పెట్టారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదన్నారు ఊర్మిళ తండ్రి శ్రీకాంగ్ మంటోడ్కర్. వికీపిడియా తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయం కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఊర్మిళ ప్రజాస్వామ్యయుతంగానే తన పోరాటం చేస్తున్నారన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఊర్మిళపై చేస్తున్న అసత్య ప్రచారాల్ని తప్పు పడుతున్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రేనంటూ దుయ్యబట్టారు.

అటు ఊర్మిళ మాత్రం ఇవేం పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముంబై నార్త్ లోక్‌సభ నుంచి పోటీకి దిగుతున్న ఆమె బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రలు ఎక్కుపెట్టారు. మరోవైపు ఊర్మిళ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. 2005లో బాలీవుడ్ యాక్టర్ గోవిందా చేసిన ఎన్నికల ప్రచారం కన్నా ఈసారి ఊర్మిళకు అన్నివర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

 
First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading