మోడీ నామినేషన్‌ను రద్దు చేయండి.. ఈసీకి అందిన ఫిర్యాదు..

మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉంటే మమత ప్రభుత్వమే పడిపోయే అవకాశం ఉంటుంది.

  • Share this:
    ప్రధాని మోడీ నామినేషన్ రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందువల్ల మోదీని పోటీకి అనర్హుడిగా ప్రకటించి, నామినేషన్‌ను రద్దు చేయాలని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు సోమవారం ఈసీ అధికారులను కలిసి లేఖను అందజేశారు. మరోవైపు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న మోదీ, అమిత్ షాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకొనేలా ఆదేశించాలన్న ఫిర్యాదులపై నేడు సుప్రీం విచారణ చేపట్టనుంది.

    లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సెరామ్‌పూర్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన మోదీ.. బీజేపీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు తమతో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బాంబుపేల్చారు. ‘దీదీ! మే 23న ఫలితాలు వెలువడ్డాక ప్రతి చోట కమలం వికసిస్తుంది. అప్పుడు మీ ఎమ్మెల్యేలంతా మిమ్మల్ని వదిలి వెళ్తారు. ఇప్పటికే 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉంటే మమత ప్రభుత్వమే పడిపోయే అవకాశం ఉంటుంది. మరి మే 23న ఏం జరగబోతోంది? మోదీ చెప్పినట్లుగానే టీఎంసీ ఎమ్మెల్యేలు మమతను వీడతారా? కమలం గూటికి చేరతారా? అని జోరుగా చర్చ జరుగుతోంది.
    First published: