బీజేపీకి మరో బిగ్ షాక్.. ఈ సారి బెంగాల్‌లో..

లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని దెబ్బకొట్టిన బీజేపీ అదే ఊపును కొనసాగించలేకపోయింది. కాలియా గంజ్‌, ఖరగ్‌పూర్ సాదర్, కరీంపూర్‌ మూడు చోట్లా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది.

news18-telugu
Updated: November 28, 2019, 4:10 PM IST
బీజేపీకి మరో బిగ్ షాక్..  ఈ సారి బెంగాల్‌లో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో ఇప్పటికే అధికారానికి దూరమైంది బీజేపీ. కుర్చీ దాకా వచ్చిన పగ్గాలను శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే లాగేసుకున్నారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే బెంగాల్‌లో మరో షాక్ తగిలింది. ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా కమలం వికసించలేకపోయింది. సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోవడం.. ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని దెబ్బకొట్టిన బీజేపీ.. అదే ఊపును ఉపఎన్నికల్లో కొనసాగించలేకపోయింది.

కాలియా గంజ్‌, ఖరగ్‌పూర్ సాదర్, కరీంపూర్‌ మూడు చోట్లా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. కలియాగంజ్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమతనాథ్ రాయ్ మరణించడంతో ఉపఎన్నిక వచ్చింది. కరీంపూర్‌లో సిట్టింగ్ టీఎంసీ ఎమ్మెల్యే మహువా మొయిత్రా, ఖరగ్‌పూర్ సాదర్‌లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ ఘోష్ ఎంపీలుగా ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబరు 25న ఈ మూడు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగాయి. ఐతే మూడు చోట్లా టీఎంసీ అభ్యర్థులే గెలవడంతో .. బెంగాల్‌లో బలపడాలని భావిస్తున్న బీజేపీకి షాక్ తగిలింది.

ఐతే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది. కొన్నాళ్లుగా బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ ఆ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. గతంలో 2 సీట్లకే పరిమితమైన కమలదళం ఈసారి ఏకంగా 18 స్థానాలు గెలిచి మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చింది. ఇక ఊహించని విధంగా టీఎంసీ 16 సీట్లను కోల్పోయింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకోగా.. 2019లో 22 సీట్లకే పరిమితమైంది. ఐతే ఇదే ఊపును కొనసాగించాలని భావించిన బీజేపీ.. అసెంబ్లీ ఉపఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>