• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TRINAMOOL CONGRESS MP SISIR ADHIKARI JOINS IN AMIT SHAH RALLY SAID THAT MAMATA BANERJEE WILL LOSE NANDIGRAM SEAT HSN

West Bengal Assembly Elections 2021: నో డౌట్.. సీఎం మమతా బెనర్జీ ఓటమి ఖాయం.. బహిరంగ సభలో బాంబు పేల్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

West Bengal Assembly Elections 2021: నో డౌట్.. సీఎం మమతా బెనర్జీ ఓటమి ఖాయం.. బహిరంగ సభలో బాంబు పేల్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి, సీఎం మమతా బెనర్జీ

అనుమానం అక్కర్లేదు. సీఎం మమతా బెనర్జీ ఓడిపోబోతున్నారు. నందిగ్రామ్ లో ఆమె ఓటమి ఖాయం. ఆమెపై బీజేపీ తరపును పోటీ చేస్తున్న సువేందు అధికారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎన్నికల్లో ఈసారి బీజేపీయే గెలవబోతోంది. రాసి పెట్టుకోండి.

  • Share this:
    ‘అస్సలు అనుమానం అక్కర్లేదు. సీఎం మమతా బెనర్జీ ఓడిపోబోతున్నారు. నందిగ్రామ్ లో ఆమె ఓటమి ఖాయం. ఆమెపై బీజేపీ తరపును పోటీ చేస్తున్న సువేందు అధికారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది తథ్యం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి బీజేపీయే గెలవబోతోంది. రాసి పెట్టుకోండి. నా మాటలు నిజమౌతాయి‘ అంటూ ఓ భారీ బహిరంగ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ కుమార్ అధికారి స్పష్టం చేశారు. అయితే ఆయన పాల్గొన్నది, ఈ వ్యాఖ్యలు చేసినదీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో కాదండోయ్. బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న బహిరంగ సభలో మాట్లాడిన శిశిర్ కుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సువేంధు అధికారి గతేడాది డిసెంబర్ నెలలో భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ రాష్ట్ర బీజేపీ శాఖలో ఆయన హవా కొనసాగుతోంది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై పోటీ చేసేందుకు సువేంధుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మమతా బెనర్జీపై 50 వేల మెజార్టీతో గెలవలేకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటూ సువేంధు సవాల్ చేశారు కూడా. ఆయన తండ్రి శిశిర్ కుమార్ అధికారి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. అధికారికంగా బీజేపీలో చేరకపోయినా, ఆ పార్టీ తరపునే ప్రచారంలో పాల్గొంటున్నారు. నందిగ్రామ్ లో తన కుమారుడు సువేందు అధికారి గెలిచి తీరడం తథ్యమని శిశిర్ కుమార్ తేల్చిచెబుతున్నారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మినీ కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ఎత్తులకు పై ఎత్తులతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వేసవికాలంతో పనిలేకుండానే రాజకీయాలతోనే వేడెక్కిపోతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో దేశమంతటా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఎవరు గెలుస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎనిమిది విడతలుగా ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఎన్నికలు జరగబోతుండటంతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు