ఏపీ సచివాలయం హౌస్‌ఫుల్.. కిటకిటలాడుతున్న మంత్రుల పేషీలు..

మధ్యాహ్నం లంచ్ సమయంలో సీఎం జగన్‌ సచివాలయం నుంచి ఇంటికి బయలుదేరగా.. మెయిన్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరి ఉండటం గమనించారు. దీంతో ఆయన కాన్వాయ్‌ని పంపించేందుకు వాహనాలను అక్కడినుంచి క్లియర్ చేశారు.

news18-telugu
Updated: July 2, 2019, 5:16 PM IST
ఏపీ సచివాలయం హౌస్‌ఫుల్.. కిటకిటలాడుతున్న మంత్రుల పేషీలు..
సచివాలయం ముందు భారీ సంఖ్యలో నిలిచిపోయిన కార్లు..
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సందర్శకులు పోటెత్తారు.బదిలీల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మంత్రుల సిఫారసు కోసం అధికారులు సచివాలయానికి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు దాదాపు 3500 కార్లు సచివాలయానికి వచ్చినట్టు భద్రతా సిబ్బంది చెబుతున్నారు. భారీ సంఖ్యలో కార్లు సచివాలయానికి రావడంతో మెయిన్ గేట్ వద్ద వాహనాలన్నీ బారులు తీరాయి. అధికారులు, వారితో పాటు వచ్చిన అనుచరులు.. అంతా కలిసి దాదాపు 7వేల నుంచి 8వేల మంది ఈ ఒక్కరోజే సచివాలయానికి వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.

మధ్యాహ్నం లంచ్ సమయంలో సీఎం జగన్‌ సచివాలయం నుంచి ఇంటికి బయలుదేరగా.. మెయిన్ గేట్ వద్ద భారీగా వాహనాలు బారులు తీరి ఉండటం గమనించారు. దీంతో ఆయన కాన్వాయ్‌ని పంపించేందుకు వాహనాలను అక్కడినుంచి క్లియర్ చేయాల్సి వచ్చింది. సచివాలయం లోపలికి అనుమతించేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నందునా.. మెయిన్ గేట్ వద్దే చాలా వాహనాలు నిలిచిపోయాయి.బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సోమ,మంగళవారాల్లో జగన్ సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో.. మంత్రులంతా సచివాలయంలో అందుబాటులో ఉన్నారు. దీంతో అధికారులంతా బదిలీల సిఫారసు కోసం మంత్రులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదికారుల రాకపోకలతో మంత్రుల పేషీలు కిటకిటలాడుతున్నాయి.


First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>