కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ బాస్‌గా బాధ్యతలు తీసుకోవడంతో.. రాష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కాంగ్రెస్‌ను రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా మార్చడంలో రేవంత్ రెడ్డి కచ్చితంగా సక్సెస్ అవుతారని పార్టీ కార్యకర్తలు ఆశించారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కొద్దినెలల క్రితం నిర్వహించిన దళిత దండోరా సభలు కూడా సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ మీద ఉన్న సమయంలో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డికి కూడా పెద్ద దెబ్బగా మారాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో.. ఆ పార్టీలోని పలువురు సీనియర్లు, రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఆయనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో దూకుడు మీదున్న రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు.
మరోవైపు రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రావడం వల్ల కాంగ్రెస్‌లో పెరిగిన జోష్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు తరువాత ఆవిరైపోయింది. ఎవరొచ్చినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంతే అన్నట్టుగా పరిణామాలు మారిపోయాయి. అయితే హుజూరాబాద్‌లో ఎదురైన దారుణమైన ఫలితాల నుంచి కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరోవైపు రాబోయే కొన్ని నెలల కాలంలో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడం కూడా రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే తన టార్గెట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
అయితే అనుకోని విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు రేవంత్ రెడ్డికి చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోలుకుని మళ్లీ ముందుకు సాగే అవకాశం దక్కిందనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సైతం అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముందుగా కామెంట్ చేసింది రేవంత్ రెడ్డే. కొద్ది వారాల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో.. రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా పక్కా సమాచారంతో ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపించింది.
Jana Reddy: జానారెడ్డి ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా ?.. లైన్ క్లియర్ అయినట్టేనా ?
K ChandraShekar Rao: అప్పటివరకు మౌనమే.. సీఎం కేసీఆర్ అలా డిసైడయ్యారా ?
ప్రస్తుతం రేవంత్ రెడ్డికి పార్టీకి గాడిలో పెట్టేందుకు ఒక మంచి అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడప్పుడే ఎన్నికలు కూడా లేకపోవడంతో.. రేవంత్ రెడ్డి తాను అనుకున్నది చేసేందుకు కావాల్సిన సమయం దొరికిందని చెబుతున్నారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారిని పట్టించుకోకుండా తాను అనుకున్నది సాధించే క్రమంలో ముందుకు సాగితే.. ఆయన అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అదే పనిలో ఉన్నారని.. కాంగ్రెస్ సంస్కృతిని తొందరగా అలవాటు చేసుకుని ఆయన ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే అధికార టీఆర్ఎస్తో పాటు రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని కూడా ఎదుర్కోవడం రేవంత్ రెడ్డికి సవాల్‌గా మారనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Revanth Reddy, Telangana