Andhra Pradesh: టీడీపీకి అశోక్ గజపతి రాజు షాక్: విజయనగరంలో పోటీకి నిర్ణయం

అశోక్ గజపతిరాజు ( ట్విట్టర్ ఫోటో)

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే.. విజయనగరం జిల్లాలో మాత్రం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • Share this:
    ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ టీడీపీలో దుమారం రేపుతోంది. అధిష్టానం నిర్ణయంపై  సీనియర్ నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..  టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు.

    కాసేపటికే మరో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన సైతం అదే విషయం స్సష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం సరైందని కాదని.. కార్యకర్తలు ఎంతో కష్టనష్టాలకు ఓర్చి నామినేషన్ వేశారని.. ఇలాంటి సమయంలో  వారికి అండగదా ఉండాల్సిన అవసరం పార్టీకి ఉందని.. అందుకే తాను చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

    సీనియర్ నేతలే కాదు.. ఇప్పటికే నామినేషన్ వేసిని అభ్యర్థులు సైతం అదిష్టానం నిర్ణయంతో షాక్ కు గురయ్యారు. నామినేషన్ సమయాల్లో వైసీపీ నేతలు, దాడులు దౌర్జన్యాలకు అడ్డుగా నిలిచామని. ప్రాణాలను పణంగా పెట్టి నామినేషన్లు వేశామని.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయొద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీ వరుస  ఓటములతో ఇబ్బంది పడుతోంది. దీంతో సీనియర్ నేతలంతా ఇప్పుడు నేరుగా దిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా పరిషత్ ఎన్నికల నిర్ణయంపైనా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

    త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. స్వయంగా ఆ విషయాన్ని చంద్రబాబే ప్రకటించారు. కానీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని విజయనగరం టీడీపీ నేతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.  నియోజకవర్గ టీడీపీ నాయకులతో చర్చలు జరిపి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ప్రకటించారు.

    అయితే ఎన్నికల్లో పోటీకి సంబంధించి స్థానిక పరిస్థితిలను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం చెప్పింది అన్నారు అశోక్ గజపతి రాజు. ఏఢాదికిపైగా ఎన్నికలు కొనసాగుతుండటం  చాలా దురద్రుష్టకరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని.. అయినా .ఎన్నికలు ఆగిన చోట నుంచే కొనసాగించడం సరైన నిర్ణయం కాదన్నారు అశోక్ గజపతి రాజు.

    ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందన్నారు.  తాను పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరవడం కాదని.. జూమ్ మీటింగ్ లో జాయిన్ కాలేదు అంతే అన్నారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ అని గుర్తు చేశారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవని,  పోటీలో గెలిచినా, గెలవక పోయినా...సిద్ధాంతాలు మాత్రం విడవకూడదన్నారు.
    Published by:Nagesh Paina
    First published: