Home /News /politics /

TPCC WORKING PRESIDENT REVANTHREDDY SHOWS HIS STRENGTH IN PANCHAYATH ELECTIONS PS

అసెంబ్లీ పోరులో ఓడినా.. అక్కడ సత్తాచాటిన రేవంత్‌రెడ్డి

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో 60 శాతానికిపైగా పంచాయితీలను తన ఖాతాలో వేసుకుంది టీఆర్ఎస్. అక్కడ మాత్రం సత్తా చూపలేకపోయింది. ఫలితాలతో అధికారపార్టీ షాకవ్వాల్సి వచ్చింది.

    అసెంబ్లీ ఎన్నికల జోరును పంచాయితీ ఎన్నికల్లోనూ కొనసాగించింది టీఆర్ఎస్ పార్టీ. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని.. పంచాయితీల్లో పట్టు నిలుపుకొంది. అయితే, అసెంబ్లీ బరిలో ప్రతిష్టాత్మకంగా భావించి.. రేవంత్ రెడ్డి నుంచి కొడంగల్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి.. అక్కడి పంచాయితీ ఎన్నికలు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్‌లో గులాబీ జెండా ఎగరేసినా.. పల్లెపోరులో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.

    మరోవైపు, అసెంబ్లీ బరిలో ఓడినప్పటికీ.. నియోజకవర్గంపై తన పట్టు నిలుపుకొన్నారు రేవంత్ రెడ్డి. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఆయన సక్సెసయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 30 గ్రామ పంచాయితీలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో గెలిచింది. అధికార టీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలకే పరిమితం కాగా, 3 చోట్ల స్వతంత్రులు గెలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటిన అధికార టీఆర్ఎస్ పార్టీకి.. కొడంగల్ ఫలితాలు షాకిచ్చాయి.

    పంచాయితీ ఎన్నికల్లో రేవంత్ కష్టానికి ఫలితం దక్కడంతో.. ఆయన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదీ.. రేవంత్ చరిష్మా అంటూ ఆయన ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
    ఇక,  పంచాయితీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించడం వల్లే గోల్‌మాల్ జరగలేదని ఫలితాలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా వచ్చాయని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో ఏదో గోల్‌మాల్ జరిగి ఉంటుందని, అందుకే రేవంత్ ఓడిపోయారని.. కొత్త వివాదానికి తెరపైకి తీసుకొచ్చారు. ఈవీఎం టాంపరింగ్ వల్లే పట్నం నరేందర్ రెడ్డి గెలిచాడని, లేదంటే సాధ్యమయ్యేది కాదని చెబుతున్నారు. ఈవీఎం టాంపరింగ్‌పై ఇప్పటికే రేవంత్ రెడ్డి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. మున్ముందు టీఆర్ఎస్‌కు ధీటుగా ముందుకు వెళ్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా, ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న రేవంత్.. పంచాయితీ ఎన్నికల బరిలో ప్రచారం నిర్వహించి మంచి ఫలితాలు సాధించడంతో ఆయన అనుచరగణంలో జోష్ కనిపిస్తోంది.
    First published:

    Tags: Gram Panchayat Elections, Revanth reddy, Trs, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు