కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు.. నువ్వు తెలంగాణ బిడ్డవైతే అంటూ..

మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. జన్వాడలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు.

news18-telugu
Updated: June 8, 2020, 2:15 PM IST
కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు.. నువ్వు తెలంగాణ బిడ్డవైతే అంటూ..
కేటీఆర్, రేవంత్ రెడ్డి
  • Share this:
మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. జన్వాడలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. ‘జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్‌కి కేటీఆర్ యజమాని కాదని, బాల్కసుమన్ అని అన్నారు. ఫామ్ హౌస్ కేటీఆర్ లీజుకు మాత్రమే తీసుకున్నారని అన్నారు. సర్వే నంబరు 301-313 వరకు నాకు ఎలాంటి భూములు లేవని కేటీఆర్ ట్విట్టర్‌లో చెప్పారు. మార్చి5న డ్రోన్ ఉపయోగించానని నన్ను జైల్ కి పంపారు. రేవంత్ రెడ్డి వల్ల సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆస్తులకు, ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు నివేదిక కూడా ఇచ్చారు. అదే నివేదికలో కేటీఆర్ భూములు ఉన్నాయని, కేటీఆర్ కుటుంబం నివసిస్తోందని కోర్టుకు చెప్పారు’ అని రేవంత్ గుర్తు చేశారు. 2019 మార్చి 7న 301 సర్వే నెంబరులో రెండు ఎకరాలు కేటీఆర్, ఆయన భార్య పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యిందని మీడియాతో చెప్పారు.

2018 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.2కోట్ల ఆస్తులు జన్వాడ అర్బనా వెంచర్స్ పేరు మీద ఆస్తులు ఉన్నట్లు స్వయంగా కేటీఆర్ తెలిపారని, 25 ఎకరాలు - 1 లక్ష చదరపు అడుగుల్లో ఆయన ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపించారు. కేటీఆర్ 301-13 సర్వే నంబర్లలో భూములు లేవన్న కేటీఆర్ మాటలు అబద్ధమని రేవంత్ అన్నారు. కోర్టుకు ఇచ్చిన నివేదికల్లో, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలను బట్టి జన్వాడ గ్రామంలో కేటీఆర్‌కు రెండు ప్రాంతాల్లో భూములు ఉన్నాయని చెప్పారు.

ఇక,ఒట్టినాగులపల్లిలో తనకు 22గుంటలు, తన బావమరిదికి 20 గుంటల భూమి ఉందని రేవంత్ తెలిపారు. కేటీఆర్, ఆయన దండు తన అక్రమ నిర్మాణాలను చూపించాలని సవాల్ విసిరారు. తాను, కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు మార్గదర్శిగా ఉండాలని అన్నారు. 1990లో అక్రమ భూముల విషయంలో బాధ్యత వహిస్తూ కోనేరు రంగారావు మంత్రి పదవికి రాజీనామా చేశారని, విచారణలో తనకు సంబంధం లేదని తెలిశాకే మంత్రి పదవి చేపట్టారని గుర్తు చేశారు.

మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌ను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం లేదని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. కేటీఆర్, ఆయన సతీమణి పై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని, కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే బయటకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తన ఆరోపణల్లో ఒక్క శాతం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 8, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading