కేసీఆర్‌కు వింతరోగం.. కామ్రేడ్‌లతో కలిసి అరాచకాల్ని అడ్డుకుంటాం: రేవంత్‌రెడ్డి

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ప్రజాకూటమి మిత్రులను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు.

news18-telugu
Updated: March 17, 2019, 2:14 PM IST
కేసీఆర్‌కు వింతరోగం.. కామ్రేడ్‌లతో కలిసి అరాచకాల్ని అడ్డుకుంటాం: రేవంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: March 17, 2019, 2:14 PM IST
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ప్రజాకూటమి మిత్రులను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. దీనికి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేతలు హామీ ఇచ్చినట్టు రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై విమర్శలు గుప్పించారు. కేసీఆరే మోదీ.. మోదీయే కేసీఆర్ అన్నారు. వీరిద్దరూ అరాచకత్వానికి బొమ్మా, బొరుసులాంటి వారని విమర్శించారు. కామ్రేడ్ల సాయంతో బీజేపీ, టీఆర్ఎస్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని.. మల్కాజ్‌గిరిలో విజయాన్ని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, మోదీలు ఒకే తాను ముక్కలన్న రేవంత్ రెడ్డి.. పైకి మాత్రమే ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఆరోపించారు. 16 ఎంపీలు గెలిపిస్తే ఏదో సాధిస్తానంటున్న కేసీఆర్‌ ఇంతకు ముందు ఏం చేశారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఎంపీల్లో .. నంది ఎల్లయ్య మినహా అందరూ కేసీఆర్ కనుసైగల్లోనే పనిచేశారని.. అప్పుడేం సాధించారో చెప్పాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలాడుతున్న కేసీఆర్‌కు ఓటేస్తే.. ఢిల్లీలో మోదీకి అమ్ముకుంటాడని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బయపెట్టి తన పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

ఫుల్ మెజార్టీతో రెండో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వింత రోగంతో బాధపడుతున్నట్టుగా అనిపిస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే సరిపడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని.. కిక్కు కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్.. గచ్చిబౌలీ దివాకర్ లాంటోడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

First published: March 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...